ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలికి సోనియా నివాళులు
posted on Dec 31, 2012 @ 5:09PM
ఈ నెల 16 న ఢిల్లీ లోని ఓ బస్సులో దారుణంగా రేప్ కు గురి అయిన చివరకు మరణించిన మహిళ అంత్య క్రియలు నిన్న పూర్తి అయ్యాయి. ఆమె మృత దేహాన్ని నిన్న ఉదయం సింగపూర్ నుండి ఎయిర్ ఇండియా ప్రత్యెక విమానంలో ఢిల్లీ కి తీసుకువచ్చారు. అ వెంటనే ఆమె మృత దేహాన్ని ఢిల్లీ లోని ఆమె ఇంటికి తీసుకువెళ్ళారు. విమానాశ్రయం వద్ద ఆమె మృత దేహానికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రధాని, సోనియా ఇద్దరూ మృతురాలి తల్లి తండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చారు.
మృత దేహాన్ని ఆమె ఇంటికి తీసుకు వెళ్ళిన వెంటనే, ఆ ప్రాంతంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో మృత దేహాన్ని పరమర్సించేందుకు వచ్చారు.ఢిల్లీ ముఖ్య మంత్రి షీలా దీక్షిత్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ ఆ యువతి అంత్య క్రియల్లో పాల్గొన్నారు. ఆమె కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, కొంత మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ అంత్య క్రియల్లో పాల్గొన్నారు. మరో వైపు తన కుమార్తె మరణాన్ని తట్టుకోలేని అ యువతి తల్లి అనేక సార్లు మూర్చపోయింది. దీనితో ఆమెను దీన దయాల్ ఉపాద్యాయ్ ఆసుపత్రిలో చేర్చారు.