ఏపీలో అభివృద్ధి జరగట్లేదు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
posted on Aug 19, 2021 @ 1:14PM
ఏపీ. అభివృద్ధిలో తిరోగతి. అప్పులే గతి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పు. ఆఖరికి పెన్ను, పేపరు కొనాలన్నా అప్పు..అప్పు..అప్పు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందంటారు. అమరావతిని మూడు ముక్కలు చేసేసి.. అభివృద్ధిని అటకెక్కించేసి.. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయేలా చేసి.. కేవలం సంక్షేమం అంటూ ప్రజలకు పప్పు-బెల్లాలు పంచేసి.. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేస్తున్నారనే విమర్శ పెద్ద ఎత్తున విమర్శిస్తోంది. అయితే, తాజాగా కేంద్రమంత్రి చేసిన కామెంట్లు ఏపీ పథకాల డొల్లతనాన్ని బయటపెడుతోంది. సంక్షేమం పేరుతో సొంతడబ్బా కొట్టుకుంటున్న జగన్ సర్కారుకు చెంపపెట్టుగా మారుతోంది.
కేంద్ర పథకాలు మినహా ఏపీలో అభివృద్ధి జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోంది. రాష్ట్ర వాటా నిధులు లేక కొన్ని కేంద్ర పథకాల పనుల్లో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుతం కనిపిస్తున్న కాస్తోకూస్తో అభివృద్ధి కూడా కేంద్రం వల్లే జరిగిందని చెప్పారు.
ఏపీకి అనేక విద్యాసంస్థలను మంజూరు చేసినట్టు.. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను డెవలప్ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు కిషన్‌రెడ్డి. కరోనా సమయంలో ఏపీకి 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపించిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైనా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. తెలుగు స్టేట్స్ సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్రం భావన అన్నారు.