Read more!

పసుపు బోర్డ్ లేదన్న కేంద్రం.. ఎంపీ అరవింద్ రాజీనామా  చేస్తారా?

తెలంగాణలో ముఖ్యంగా నిజామబాద్  రాజకీయాల్లో పసుపు బోర్డు ఏర్పాటు, సంచలనమే సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర రాకుమార్తె కవితను ఎన్నికలలో ఓడించింది. వివరాలలోకి వెళితే, నిజామాబాద్   జిల్లాలో పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని, రైతులు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు.ఈ ఆందోళనల నేపధ్యంలో జరిగిన 2019లోక్ సభ ఎన్నికల్లో, బీజేపీ అభ్యర్ధిగా పోటీ  చేసిన, ప్రస్తుత ఎంపీ ధర్మపురి శ్రీనివాస్, తనను గెలిపిస్తే, ఆరే ఆరు నెలల్లో పసుపు బోర్డు పట్టుకోస్తాని వాగ్దానం చేశారు.అంతే కాదు, ఒక వేళ తేలేక పోతే రాజీనామా చేస్తానని, సంతకం చేసిన బ్యాండ్ పేపర్లు ఇంటింటికీ పంచారు.ప్రజలు అలవాటుగా  ఆయన్ని నమ్మారు.అంతకు ముందు ఇదే వాగ్దంతో గెలిచిన సిట్టింగ్ తెరాస ఎంపీ, కవితను ఓడించి ఎంపీ అయ్యారు. ఆయన ఎంపీగా గెలిచి మూడార్లు 18నెలలైన ఇంతవరకు పసుపు బోర్డు మాత్రం రాలేదు.

తాజాగా చావు కబురు చల్లగా చెప్పినట్లు, తెలంగాణలో  పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టం చేశారు.రాజ్య సభలో తెరాస సభ్యుడు సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. బోర్డుకు బదులుగా నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పసుపు ఎగుమతుల కార్యక్రమాలు ప్రోత్సహించడం, దిగుబడులపై రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయానికి ఈ కార్యాలయం పనిచేస్తుందని తెలిపారు. పసుపుతోపాటు సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ప్రోత్సాహానికి హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో బోర్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రత్యేక హోదాకు బదులుగా,ప్యాకేజని రెంటికీ పంగనామం పెట్టినట్లుగానే, ఇప్పుడు తెలంగాణలో  బోర్డు స్థానంలో ప్రాంతీయ కార్యలయమని  రెంటికీ ... ఎగనామం పెడతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వంక అరవింద్ రాజీనామా చేయాలని రాజకీయ పార్టీలు రాజీనామా చేయలని డిమాండ్ చేస్తున్నాయి.