జగన్ బెయిల్ రద్దు?.. ఆగస్టు 25న సీబీఐ కోర్టు జడ్జిమెంట్..
posted on Jul 30, 2021 @ 12:35PM
రఘురామ ఎన్నాళ్లో వేచిన ఉదయం. ఆగస్టు 25న ఆవిష్కృతం కాబోతోంది. జగన్ బెయిల్ రద్దు కేసులో ఆ రోజు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇన్నాళ్లూ వాయిదాల పర్వంతో నెట్టుకొచ్చిన జగన్.. ఇప్పుడిక లాక్ అయ్యారు. సీబీఐ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో తీర్పుకు ముహూర్తం ఫిక్స్ అయింది.
జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ మరోసారి సమయం కోరింది. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. సీబీఐ లాయర్ల అభ్యర్థనను రఘురామ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. మరింత సమయం ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇక్కడే సీబీఐ న్యాయవాది వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. బెయిల్ రద్దు అంశంలో కోర్టు విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో విచారణ ముగిసిందని, ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.
జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ మొదటి నుంచి అరకత్తరలో పోకచెక్కలా మారింది. బెయిల్ రద్దు చేయాలంటూ నేరుగా రాసివ్వలేకపోయింది. అలాగని బెయిల్ కొనసాగించానీ చెప్పలేని పరిస్థితి. రఘురామ పూర్తి సాక్షాధారాలతో సీబీఐని ఏదో ఒక నిర్ణయం చెప్పేలా చేసేందుకు బాగా ట్రై చేశారు. కానీ, సీబీఐ ఎప్పటికప్పుడూ తప్పించుకుంటూ వచ్చింది. ఈసారి కూడా మరో వాయిదా కోరింది. కానీ, రఘురామ లాయర్, కోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలంటే సీబీఐ న్యాయవాది హ్యాండ్సప్ అన్నారు. దీంతో.. కేసు విచారణ ముగిసిందని.. ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడిస్తామని సీబీఐ కోర్డు స్పష్టం చేసింది. బెయిల్ రద్దు అయ్యే అవకాశమే ఎక్కువగా ఉండటంతో.. సీఎం జగన్‌కు ఇక దబిడి దిబిడే.