పోలీసులకు కిక్ సినిమా చూపించిన దొంగ. .
posted on Jun 10, 2021 @ 2:31PM
దొంగ దొంగ వచ్చాడే అన్ని దోసుకపోతాడే.. ముంబై లోనే మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే.. ఈ పాట వైన్ ఉంటారు.. అయితే కొందరు దొగతనం చేస్తారు.. దాన్ని కొంతమంది వృత్తిగా చేస్తే.. ఇంకొంత మంది ప్రొఫెషన్ గా చేస్తారు.. ఒక చోట దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు కామన్.. కానీ అదే దొంగ సవాలు పోలీసులకు సవాల్ చేస్తే అరుంధతి సినిమాలో అనుష్కలా నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా అని ఛాలెంజ్ చేస్తూ పోలీసులకు దొరకకుండా దొంగతనం చేయడం ఒక ఆర్ట్.. ఇది చదివిన తర్వాత అయిన ఎలాంటివి ఉంటాయా భయ్యా అని అనుకుంటున్నారా.. ఒక వేళా ఉన్న ఇలాంటివి జరగడానికి సినిమాలో అవకాశం ఉంటుంది గానీ లైఫ్ ఇలాంటివి సాధ్యం కాదు అంటున్నారా.. ఈ వార్త అక్షరాలా వాస్తవం.. ఆ వాస్తవం తెలియాలంటే ఈ వార్త చదవండి..
ఓపెన్ చేస్తే.. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో ఈ ఏడాది జనవరిలో నిర్మాత మంజునాథ్ కారు మిస్ అయింది. ఆ క్రమంలో నమోదైన కేసులో… చోరీ చేసింది రాజస్థాన్‌కు చెందిన ఓ దొంగ తమిళ్ హీరో కార్తీక్ సినిమా ఖాకీ సినిమాను చూపించాడు.. ఆ దొంగ గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దొంగ పోలీస్ సినిమాలు అని చూపించాడు.. ఆ దొంగ హైదరాబాద్ పోలీసులకు చివరికి ఆ దొంగ ఊరుకు వెళ్లినా పట్టుకోలేక ఉట్టి చేతులతో తిరిగి వచ్చారు. అంతేకాదు.. పోలీసులకే ఏకంగా వీడియో కాల్ చేసి మరీ సవాల్ విసిరాడా దొంగ. నా ఫోటో తీసి పెట్టుకోండి.. గుర్తుంచుకోండి. అంతవరకే..మాత్రమే.. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దొరకనని చెప్పడం పోలీసులకు షాక్ ఇచ్చినట్టు అయింది.
రాజస్థాన్‌కు చెందిన ఈ గజదొంగ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56 కార్లను చోరీ చేశాడు. ఏ ఒక్క కేసులో కూడా అతన్ని పోలీసులు పట్టుకోలేదు. కేసును చేధించింది లేదన్నది వాడి ట్రాక్ రికార్డ్. ఆ దొంగ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు. ఎలా చోరీ చేస్తాడన్నది ఎవరికీ తెలియదు. కానీ చోరీ సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాడన్నది మాత్రం పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు రాజస్థాన్‌కు వెళ్లారు. ఊరు వివరాలు తెలుసుకుని కొన్ని రోజులు రిక్కీ నిర్వహించారు. అయినా దొంగ దొరకలేదు.. పైగా పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న సదరు దొంగనే.. నేరుగా పోలీసులకు ఫోన్ చేయడం పోలీసులకు దిమ్మ బొంగరం లా తిరిగినంత పనైంది. మీరు నా గురించి వెతికింది చాలు.. నా కోసం టైం వేస్టు చేసుకోకండి అన్నట్టుగా మాట్లాడి పోలీసులను ఖాళీగా తిరిగి హైదరాబాద్ వచ్చేలా చేశాడు.
అయితే కారును పోగొట్టుకున్న నిర్మాత మంజునాథ్ మాత్రం.. కారు పోతే పోనీ కానీ.. అందులో విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటినైనా రికవరీ చేసి ఇచ్చేలా చూడండి అంటూ వేడుకుంటున్నాడు. స్థలాలకు సంబంధించిన కీలక పత్రాలు అందులో ఉన్నాయని చెబుతున్నాడు. ఓవైపు తెలివిమీరిన దొంగ.. మరోవైపు బాధితుడి ఆవేదనతో పోలీసులు నలిగిపోతున్నారు. నేరచేధనలో ముందున్న హైదరాబాద్ పోలీసులకు ఇప్పుడీ చోరీ వ్యవహారం పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది.