Read more!

క్యాన్సర్ అంటే ఏమిటి ? 


కొన్ని అపోహలు,సందేహాలు.అవగాహన. క్యాన్సర్ గురించి అందరూ వినే ఉంటారు. కాని క్యాన్సర్ అంటే ఏమిటి ? అని అడిగితే మాత్రం చాలా మంది సమాధానాన్ని చెప్పలేరు. కొద్ది మంది మాత్రమే క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది అన్న విషయాలు తెలిసి ఉంటాయి. క్యాన్సర్ లో 1౦౦ కు పైగా రకాలు ఉన్నాయి. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు ఆఖరికి కళ్ళు గుండె కు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉందంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. క్యాన్సర్ ప్రారంభం మొదట ఎదో ఒక శరీర భాగపు కణాల లో మొదలు అవుతుంది. సాధారణ శరీర కణాలు క్యాన్సర్ కణాలుగా ఎలా మారాయి అన్నది తెలుసుకుంటే క్యాన్సరు రూపు రేఖలు ఏమిటో తెలుస్తాయి.

సాధారణ శరీర కణాలు...జీవిత చరిత్ర తెలియాలి. 

మన శరీరం అనేక రకాల సజీవ కణాల తో కూడుకుని ఉంటుంది. శరీరంలోని ప్రతి అవయవము కణాల సముదాయమైన తిష్యుల తో నిర్మితమై ఉంటుంది. భావన నిర్మాణం లో ఇటుకలు ఎలాంటివో శరీరంలోని వివిధ విభాగాల నిర్మాణం లో టిష్యూ లు ఇటుకల లాంటివి. సాధారణ ఆరోగ్యకర శరీరంలో కణాలు పరిపక్వ స్థితికి రాగానే ఒకటికి మరిన్ని కణాలుగా విభాజ్యం చెందుతూ ఎప్పటి కప్పుడు కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక నిర్ణీత కాలం వచ్చే సరికి శరీరంలోని ప్రతి కణానికి వయస్సు చెల్లె సమయం ఆసన్న మౌతుంది.అప్పుడు అవి ఇక పని చేయని స్థితికి వస్తాయి. పని చేయని స్థితికి వచ్చిన కణాలు ఎప్పటి కప్పుడు నశించి పోతాయి. నశించిన కణాల స్థానం లో అంతకు ముందు విభాజ్యం చెందుతూ ఏర్పడిన కొత్తకణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనిషికి జీవన ప్రారంభదశలో అంటే బాల్యంలో శరీర కణాలు వేగంగా విభాజ్యమౌతూ వృద్ది చెందుతాయి. ఆకాలం లో నశించి పోయే కణాలకంటే కొత్తగా ఏర్పడే కణాల సంఖ్య అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరాలు అభివృద్ధి చెందుతూ పిల్లలు ఎదగడానికి వీలు కలుగుతుంది. ఇది మనశారీర కణాల జీవిత చరిత్ర. 

క్యాన్సర్ కణాలు ---కణితలు. 

క్యాన్సరు ఎప్పుడూ ఎదో ఒక శరీర భాగపు కణం తో ప్రారంభ మౌతుంది. కణాలు విభాజ్యం చెందడం కొత్త కణాలు గా ఏర్పడుతూ వృధీ చెందడం . పాత గా అయిపోయిన కణాలుమరణించడం అనే సహజ సిద్దమైన క్రమబద్ద క్రియ లో ఒక్కోసారి ఎక్కడో తేడా వస్తుంది. ఆ తేడా కారణంగా శరీరంలోని ఒకానొక భాగం లో పనిచేయని వయస్సు చెల్లిన కణాలు నసిన్చిపోవడం అంతే కాక అవసరం లేక పోయినా ఆ భాగాన కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవసరం తీరి నశింపు చెందకుండా ఉన్న పాత కణాలు, అవసరం లేకపోయినా ఏర్పడిన కొత్త కణాలు ఆ మొత్తంలో అక్కడి భాగం ఒక ముద్దగా గడ్డలా తయారు అవుతుంది. అలా ఏర్పడిన గద్దలనే వైద్య పరి భాషలో ట్యూమర్స్ అంటారు. గడ్డలు శరీరంలో ఏ భాగంలో ఐనా ఏర్పడవచ్చు. వీటిలో ప్రామాడం లేని గడ్డలు ఉంటాయి. ప్రమాదాన్ని కలిగించే హానికారక గడ్డలు ఉంటాయి. ప్రమాదంలేని గడ్డలను మ్యాలిగ్నేంట్ ట్యూమర్స్ అంటారు. 

 ప్రమాదాన్ని కలిగించే గడ్డలను మ్యాలిగ్నేట్ ట్యూమర్ అంటారు క్యాన్సరు గద్దలంటే ఇవే..

ప్రమాదం లేని గడ్డలు- బినైన్ ట్యూమర్స్...

* ఇవి క్యాన్సర్ ను కలిగించవు,ప్రాణాపాయం లేనివి.

* వీటిని చిన్నపాటి శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చు. సాధారణంగా ఇంకా మళ్ళీ పెరగవు.

* ఈ గడ్డ లోని కణాలు చుట్టుపక్కల కణ జాలం లోకి ప్రవేసించ లేవు. 

* అదే విధంగా మరో ప్రాంతపు శరీర భాగం లోకి వ్యాపించలేవు.

హానికార గడ్డలు -మ్యాలి గ్నేట్ ట్యూమర్స్... 

* ఇవి క్యాన్సర్ కు సంబందించిన ప్రాణాపాయ గడ్డలు. 

* ఈ రకంగా ప్రాణాంతక హానికారక క్యాన్సర్ గడ్డలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చుకాని మళ్ళీ పెరిగే అవకాసం ఉంది. 

* క్యాన్సర్ కణాలు చుట్టుపక్కల కణజాలం లోకి ఇతర శరీర భాగాలలోకి ప్రవేసించ గలుగుతాయి.

* ఈ గడ్డ లోని క్యాన్సరు కణాలు రక్త ప్రావాహం ద్వారా,లింఫ్ వ్యవస్థ ద్వారా దూరంగా ఉన్న అవయవాల
లోకి ప్రవేశించి. ఆయా భాగాలాలో కొత్త గడ్డలను ఏర్పరచ గలుగు తాయి. ఇలా దూరంగా ఉన్న ఆవయవాలలోకి క్యాన్సర్ వ్యపించడాన్ని మెటా స్టే సిస్ అంటారు.

క్యాన్సర్ లక్షణాలు ...

క్యాన్సర్ లో అనేక రకాలు ఉన్నాయి.ఒక్కోరకమైన క్యాన్సరు లో ఒక్కోరకమైన లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల క్యాన్సార్ లలో అవి భాగా ముదిరిపోయే దాకా ఏ లక్షణాలు కనిపించవు. కూడా అందుకనే  డాక్టర్స్ క్యాన్సర్ కవాచ్చు ఏమో అన్న అనుమానం కలగ గానే ఆ వ్యక్తికి వివిధ టెస్టులు ,స్క్రీనింగ్ లు జరిపిస్తారు.

క్యాన్సర్ లో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు, చిహ్నాలు ఈ విధంగా ఉంటాయి ...

* చాతిలో లేక శరీరంలో మరెక్కడైనా కొత్తగా ఏదైనా గడ్డలు కనిపించడం. 

* కొత్తగా నల్లటి మచ్చ ఏర్పడడం. లేదా అంతకు ముందే ఉన్న పులిపిరి లేక నల్ల మచ్చలో మార్పులు కనిపించడం గమనించవచ్చు. 

* పుండు ఎంతకీ తగ్గక పోవడం. 

* విడవకుండా దగ్గు, గొంతు బొంగురు పోవడం.

* మల మూత్ర అలవాట్లలో మార్పులు కనిపించడం. 

* నిరంతరం అజీర్ణం.

* మింగటానికి ఇబ్బంది కలగడం.

* ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం.

* జననేంద్రియం నుంచి అసాధారణంగా రక్త స్రావం కావడం లేక విపరీతంగా తెల్లటి ద్రవం ఉత్పత్తి కావటం. 

మొదలైన లక్షణాలు గమనించిన వెంటనే క్యాన్సరా కదా అని నిర్ధారించుకోవాలి.అయితే చెప్పినవన్నీ క్యాన్సర్ మూలంగానే వస్తాయని కాదు. ఏ ఇన్ఫెక్షన్ మూలంగానో కూడా రావచ్చు. అయినా సరే ఇలాంటి లక్షణాలు కనిపించి నప్పుడు డాక్టర్ ను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం అవసరం. పైన చెప్పిన లక్షణాలే కాకుండా కింద పేర్కొన్న కొన్ని సాధారణ లక్షణాలు కూడా వివిధ క్యాన్సర్లకు చిహ్నాలు కావచ్చు. 

పొత్తికడుపు నొప్పి పెల్విక్ పెయిన్...

బొడ్డుకు దిగువ భాగంలో పొత్తికడుపులో విడవకుండా నొప్పి వస్తే అది నెలసరి కి సంబందించిన మూలంగానే కాకుండా ఎండో మెట్రియాల్ క్యాన్సర్ ఓవరియన్ క్యాన్సర్, లేదా సర్వికల్ క్యాన్సర్ లాంటి వాటి మూలంగా కూడా కవాచ్చు. 

కడుపు ఉబ్బరం..తేన్పులు...

వీటిని మనం అంతగా పట్టించుకోము కాని రెండూ విడవకుండా ఉండడం సాధారణంగా జీర్నకోస క్యాన్సర్ లక్షణం గా అని నిపుణులు అనుమానించే అవకాశం ఉంది.

నడుము నొప్పి...

కొందరు స్త్రీలు నడుము కింది భాగంలో తీవ్రనోప్పి వస్తోందంటూ వాపోతూ ఉంటారు. కొందరు స్త్రీలు అయితే ఆ నొప్పి ప్రసవ నొప్పులంత తీవ్రంగా ఉంటోందని అంటున్నారు. బహుశా అది అండాశయ క్యాన్సర్ వల్ల కావచ్చు. 

ఎంతకీ తగ్గని జ్వరం ... 

నెలరోజులుగా గడిచినా జ్వరం తగ్గక పోతే డాక్టర్ ను కలవడం మంచిది. ఒక్కోసారి అది క్యాన్సర్ లక్షణం
కావచ్చు. 

తీవ్రమైన అలసట నీరసం...

క్యాన్సర్ లో కనిపించే సాధారణ లక్షణం. ఇది ప్రారంభ దసకంటే సాధారణంగా క్యాన్సరు ముదిరి పోయిన దశలో ఎక్కువగా కనిపిస్తుంది. మామూలు దిన చర్యలు కూడా చేసుకోలేనంతగా నీరసం. అలసట ఉంటె డాక్టర్ ను తప్పకుండా కలవాలి. 

క్యాన్సర్ ఎవరికీ వస్తుంది ?...రిస్క్ ఫాక్టర్...

క్యాన్సర్ ఎవరికీ వస్తుంది? ఎవరికీ రాదు? అన్న విషయాన్ని ఇది మిద్దం గా చెప్పడం కష్టం. కాకపోతే కొన్ని కారణాలు కొన్ని రిస్క్ ఫాక్టర్స్ క్యాన్సర్ రావడానికి మూలంగా ఉదావచ్చని పరిశోధకులు చెపుతున్నారు. స్థూలంగా చూసినప్పుడు అలాంటి అలాంటి కారణాలలో కొన్నిటిని చూద్దాం. వృద్దాప్యం. పొగ తాగే వాళ్ళు, సూర్యరస్మి, రేడియేషన్ కి గురికావడం,, విచల విడిగా,రాసాయన ఎరువులు వాడడం.
వాతావరణ కాలుష్యం, ఆహార పదార్ధాలలో రంగుల వాడకం, కొన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియా,కొన్ని హార్మోన్లు, కుటుంబ పరంగా, క్యాన్సర్ చరిత్ర ఉన్న వారికి, మద్యాన్ని సేవించేవారికి, పోషకాహార లోపం,స్థూలకాయం, పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లో కొన్ని నివారించు కోగాలిగినవి. కొన్ని మన చేతిలో ఉంటాయి.