మహారాష్ట్రలో పట్టు వీడని శివసేన స్పందించని బిజెపి...
posted on Oct 28, 2019 @ 4:15PM
మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది, గవర్నర్ భగతసింగ్ కోషియారిని శివసేన, బీజేపీ నేతలు వేరువేరుగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ తో ఇవాళ ఉదయం భేటీ అయ్యారు సీఎం ఫడ్నవీస్, తర్వాత శివసేన నేత దివాకర్ రావత్ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన డిమాండ్ పై ఇప్పటి వరకూ బిజెపి నేతలు స్పందించలేదు. అయితే గవర్నర్ తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని అటు బీజేపీ, శివసేన నేతలు చెప్తున్నారు కానీ, పరిస్థితి అలా కనిపించట్లేదు.
ఉద్దవ్ థాకరే 50-50 ఫార్ములా కోసం పట్టుబడుతున్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల ముప్పైవ తేదీన ముంబై చేరుకుంటారు. అమిత్ షా వచ్చిన తరువాత ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శివసేన నేత ఆదిత్య ఠాక్రే ను సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే ప్రస్తుతానికి మహారాష్ట్రలో ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు, ఎన్నికల సమయంలో శివసేన ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలని చూసింది కానీ, బిజెపి శివసేనకు ఆ అవకాశం ఇవ్వకుండా తానే ఎక్కువ సీట్లలో పోటీ చేయటం జరిగింది.
దాదాపు 160 సీట్లలో బిజెపి పోటీ చేయగా, 124 సీట్లలో శివసేన పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి ఊహించిన స్థాయిలో సీట్లు బిజెపికి రాలేదు, శివసేన తాను గతంలో వచ్చిన సీట్లకన్నా కొన్ని మెరుగైన ఫలితాలు వచ్చాయి.
మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా సీట్లను సాధిస్తామనే నమ్మకంతో బిజెపి ఉన్నప్పటికీ అన్ని సీట్లు రాకపోవడంతో ఖచ్చితంగా శివసేన మీద పూర్తిస్థాయిగా ఆధారపడవలసిన అవసరం అయితే ప్రస్తుతం నెలకొంది. ఇదే అదునుగా చూసుకొని శివసేన తన తన బలాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది, తన మార్క్ రాజకీయాన్ని మహారాష్ట్రలో మొదలుపెట్టింది.
అయితే ఈరోజు గవర్నర్ ను రెండు పార్టీల నేతలు అటు బిజెపి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ మరోపక్క దివాకర్ రాతే శివసేన నుంచి ఆయన కూడా వెళ్లి గవర్నర్ ను కలవడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత కేవలం వారు దీపావళి శుభాకాంక్షలు తెలపటం కోసం మాత్రమే గవర్నర్ ను కలిశాం తప్ప వేరే రాజకీయ ఉద్దేశమేం లేదని చెప్పారు.