పెళ్లి పీటలమీదే వరుడికి దరువు!
posted on Jun 11, 2022 @ 9:53PM
పెళ్లి లేదా ఏదో శుభకార్యం, కాలేజీ ఫంక్షన్, స్నేహితుల పుట్టినరోజు.. ఏదయితేనేమి వీడియోలు తీసేవారికి పండగే! పెళ్లింట సందడితో పాటు సరదాల్లో తికమక వ్యవహారాలను కూడా తీసేవారుంటారు. స్నేహితుల పుట్టినరోజు ఫంక్షన్స్ అలాంటి అల్లరి గోలలు, ఆటపట్టించడాలు ఇతరులు అంతా వీడియో తీసి మిగతా ఫ్రెండ్స్‌కి పంపించడంతో అదో పెద్ద వైరల్‌గా మారి చాలారోజులు సరదాగా గుర్తుచేసుకోవడంలో వారికి అదో ఆనందం. ఇంతవరకూ బాగానే వుంది. కానీ సరదా గొడవలు, మాటలు, కొట్లాటలు కూడా వీడియో నెట్టింట వైరల్ అయితే!ఈమధ్య ఇలాంటి సంఘటనే ఒకటి వీడియో నెట్టింట వైరల్‌గా అందరినీ నవ్విస్తోంది. అది ఎక్కడ, ఎవరి పెళ్లి వేడుకలో అనేది అవతల పెడితే అసలు సంగతికి వద్దాం. అనగనగా ఓ వూళ్లో పెళ్లి జరుగుతోంది.
బంధువులు, స్నేహి తులతో అంతా చాలా సందడిగా వుంది. పెళ్లి తర్వాత పెళ్లి విందు ఆరగించి అందరూ ఎంతో ఆనందాన్ని మూటగట్టుకుని వెళతారు.. ఇది చాలా సహజంగా అందరూ చూసింది, విన్నది. కానీ ఈ వివాహంలో ఏకంగా వధూవరులే కొట్టేసుకున్నారు. అదే ఇపుడు నెట్టింట మహాసరదాకి కారణమయింది. చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా కొత్త జీవితాన్ని సాగిస్తారని అను కుంటే వీళ్లు కొట్టుకోవడమేమిటని అందరూ ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. ఇక్కడ వధూవరులు చక్కగా మిఠాయిలు తినిపించుకోలేదు. మిఠాయిలు తినిపించుకునే చిన్నపాటి సంప్రదాయం పెద్ద గొడవకే దారితీసింది. అవును.ఇంతకీ జరిగినదేమంటే.. వధూవరులు దండలు మార్చుకున్నారు. అంతవరకూ బాగానే వుంది. ఆ వెంటనే ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకోవాలిట.
వరుడుకి ఇష్టం లేకపోయినా వధువు స్వీట్ తినిపించింది. ఆమె ఇక ఇతగాడు తన భర్తే కదా అని కాస్తంత ప్రేమ ఇప్పుడే ప్రదర్శించి బలవంతంగా నోట్లో కుక్కింది. వరుడు ఒకే అన్నాడు. మరి తన వంతు వచ్చినపుడు ఆమె కూడా ఓకే అని స్వీటు పెట్టించుకోవాలి గదా కానీ అలా జరగలేదు. అమ్మాయి ఓవరాక్షన్ చేసి తల అవతలకి తిప్పుకుంది. అసలే వరుడుగారు వెంటనే కోపంతో మొహం ఎర్రగా మారిపోయింది.
తనకి బలవంతంగా పెట్టింది, మరి తాను ప్రేమగానే మెల్లగా పెట్టడానికి స్వీట్ అందిస్తే తలతిప్పుతుందా అనుకున్నాడు. బలవంతంగా స్వీటుని కుక్కబోయేడు ఆమెకి కోపం వచ్చి అతగాడి చేతిని విసిరి కొట్టింది. అదీ ప్రేమతో అయితే పరవా ఇల్లే. జరంత కోపంతోనో, చిరాకుతోనో అయితేనే ప్రాబ్లమ్! ఎందుకంటే ఇద్దరూ చక్కగా కలిసిమెలసి జీవించవలసినవారు. ఈ వధూవరుల సరదా గొడవ చూసిన అక్కడి వారంతా షాక అయ్యారు! మరుక్షణం విరగబడి నవ్వుకున్నారు. ఇదో కొత్త తరహా సరదా! ఈ సరదా అంతా వీడియో ఎవరు తీసేరోగానీ ప్రస్తుతం వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. వెతకండి మీకూ దొరుకుతుందేవెూ!