జగన్ హయాం అరాచకాల మయం!
posted on Jun 11, 2022 @ 5:37PM
అశోకుడు చెట్లు నాటెను. గాంధీగారు దేశ స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించెను... ఇలా చరిత్ర గురించి పాఠాలు వినడం, చెప్పుకోవడం పరిపాటి. అసలు చరిత్రలో నిలవాలంటే గొప్ప కార్యాలు చేయా లి, గొప్ప ఉద్యమాన్ని నడపాలి. తప్ప హత్యలు, అరాచకాలతో పాలనాకాలం అంతా సాగించేవారిని ప్రజా ద్రోహి, దారుణమయిన పాలకునిగానే గుర్తు పెట్టుకుంటారు. ఇలాంటి ఘనకీర్తి వైసీపీ అధనేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కుతుంది.
అవును. ఆయన మూడేళ్ల పాలనలో చేసినదేమిటి అని ఒక్కసారి తరచి చూస్తే దారుణాలు, అరాచకాలు తప్ప మరోటి కనపడవు. కానీ చిర్నవ్వులు చిందిస్తూ తన పాలన భేషుగ్గా వుందని, తన మంత్రివర్గం అద్భు తంగా పనిచేస్తోందని, ప్రజలు శభాష్ అంటున్నారని ప్రచార ఆర్భాటాలు బాగానే సాగుతున్నాయి. కానీ వాస్తవ చిత్రం వేరు! వైసీపీ పాలన గురించి తెలుగు దేశం పార్టీ ప్రచురించిన పుస్తకం, వైసీపీ దమన కాండ ను తెలియజేసే ఫోటో ప్రదర్శన జగన్ పాలనా వైఫల్యాలను మరింత తెలియజేసింది. పాలనలో లోపాలు, పథకాల అమల్లో లోపాలు అక్కడా ఇక్కడా ఏదో ఒకటి జరగవచ్చు. కానీ అసలు ప్రజా సంక్షేమం అనేది ఆమడ దూరాన నిలబడిపోయింది. అందరూ భయం భయంగానే బతుకుతున్నారనేది ఆరోపణల వెల్లువ. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని వల్లకాడు చేశారన్నది టిడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుగారి ఆరోపణ.
జగన్ మూడేళ్ల పాలనపై ప్రచురితమైన పుస్తకావిష్కరణ, ఫోటో ఎగ్జిబిషన్ ఆరంభించిన చంద్ర బాబు తన ప్రసంగంలో రాష్ట్రం ఈ మూడేళ్లలో ఎంత దరిద్రంగా తయారయింది వివరించేరు. తమ పార్టీ ప్రజాప్రతి నిధులపై కేసులు పెట్టారని, గ్రామస్థాయిలో నాలుగు వేలమందిపై కేసులు బనాయించారని బాబు ఆరో పించారు. తనపైనా కేసులు పెట్టడంతో పాటు ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను, నలుగురు మాజీ మంత్రు లను జైలుకు పంపడం జగన్ విపక్షాల పట్ల కక్షసాధింపు చర్యలకు పరాకాష్టగా బాబు వర్ణించారు. పోలీసు లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటూ, మాచర్ల నియోజకవర్గంలో మూడేళ్లయినా ప్రజలు సొంత గ్రామాలకు రాలేకపోతున్నారన్నారు.
కోనసీమలో చిచ్చు వైసీపీవారి పుణ్యమే, వివేకా హత్యకేసులో సంబం ధం వున్న శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డిల మరణాలకు కారకులు ఎవరన్నది ప్రజలు గ్రహించలేక కాదు. పోలీ సులు జగన్ ప్రభుత్వానికి తొత్తులయ్యారన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణహాని వుందన్నా, సిబిఐ కేసులో అప్రూవర్‌కి ప్రాణహాని వుందన్నా పోలీసు వ్యవస్థను అనుమానించాల్సి వస్తుందని బాబు ఆరోపణ. అసలు మూడేళ్ల పాలనలో జగన్ చేసినది ప్రజారంజితం కాదు, ప్రాణభీతితో బతికేట్టు పరిస్థితులు సృష్టించిన పాలనగా పేర్కొనాలి. వైసీపీ ప్రభుత్వ పాలనపై వచ్చిన పుస్తకం, ఫోటో ప్రదర్శన మొత్తం ఈ ఘోరాలన్నీ సుస్పష్టం చేశాయి.
వైసీపీ పాలనలో జరగిన దారుణాలు లెక్కకు మించే వుంటాయి. అర్ధంలేని ఆరోపణలు, కేసులు బనా యించడం, బెదిరించడం అంతా కూడా వైసీపీ తత్వాన్ని తెలియజేస్తుంది. తన వారిని కాపాడుకోవడానికి పోలీసులను అను కూలంగా వుపయోగించుకోవడం ఆయనవల్లనే అయింది. సిబిఐ వున్నది 41 ఎ నోటీ సులు ఇవ్వడానికా అన్న ప్రశ్న అంతటా వ్యక్తమవుతోంది. దాడి చేసిన వైసిపి పై కేసులు పెట్టకుండా బాధితులు అయిన టిడిపినేతలపై కేసులు పెడుతున్నారు.
కాలువల్లో పూడిక తీయకుండా, ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా క్రాప్ హాలి డేకు తమని కారణంగా చెప్పడం అర్ధరహితమని టిడిపి అధినేత అన్నారు. జగన్ రాష్ట్రానికి పట్టిన అరిష్టం, దరిద్రం. అందుకే క్విట్ జగన్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే సరికొత్త నినాదానికి ప్రాణం పోసింది స్వయానా జగన్ పాలనే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వచ్చే ఎన్నికలే వైసిపికి చివరి ఎన్నికలు అని విపక్షాలు అనడం సత్య దూరం కాదు. రాజకీయాల్లో ఉండే అర్హత కూడా జగన్ కు లేదు. ఒక్క చాన్స్ అన్నారు....అదే చివరి చాన్స్ అయ్యింది. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన కారణంగానే రాజకీయాల్లో ఉండే అర్హతను జగన్ కోల్పోయారు. అని చంద్రబాబు అన్నారు.