బ్రహ్మి కొడుకు లవ్ మ్యారేజ్
posted on Oct 10, 2012 @ 4:18PM
కామెడీ సూపర్ స్టార్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ ప్రేమ పెళ్లిచేసుకుంటున్నాడు. తన ప్రేయసి కమ్ పెళ్లికూతురు కెమెరామన్ శ్రీనివాసరెడ్డి కూతురు కావడం మరో విశేషం. సినీ ఫీల్డులో కులాంతర వివాహాలు సర్వసాధారణం. అదే పంధాలో ముందుకెళ్లేందుకు బ్రహ్మి సన్ గౌతమ్ గట్టిగా నిశ్చయించుకున్నాడని వినికిడి. కొంతకాలంగా అమ్మాయీ, అబ్బాయీ గాఢంగా ప్రేమించుకుంటున్నారని, వాళ్ల ప్రేమని కాదనలేకే రెండు కుటుంబాలూ అన్నీ లైట్ తీస్కుంటున్నాయని వినికిడి. పైగా గౌతమ్ బ్రహ్మీ డాడీని బాగా ఒత్తిడి చేసిమరీ పెళ్లికి ఒప్పించాడని విశ్వసనీయ వర్గాల భోగట్టా. గతంలో రెండుసినిమాల్లో హీరోగా నటించి చతికిలపడ్డ గౌతమ్.. ఇప్పుడు మళ్లీ మరో మూవీతో లేటెస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడటకూడా.. రెండు కుటుంబాలూ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయినవే కాబట్టి ఈ పెళ్లి సందడికి అతిరథ మహారథులందరూ హాజరౌతారని చెప్పుకుంటున్నారు.