సోనూసూద్ ని కొట్టిన హీరో.. రెచ్చిపోయిన సోనూసూద్ అభిమాని..
posted on Jul 14, 2021 @ 3:04PM
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కరోనా సంక్షోభంలో ప్రజలకు సహాయం చేస్తూ ఆపద్బాంధవుడిగా నిలిచాడు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాడు. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాడు. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూసూద్ తన దాతృత్వంతో దేశ ప్రజలకు రియల్ హీరోగా మారాడు. అలాంటి వ్యక్తికి ఏమైనా జరిగితే తట్టుకోవడం అభిమానులకు కష్టసాధ్యమే. అది సినిమా అయినా నిజ జీవితంలో అయినా! సోనూసూద్ ప్రజలందరికీ అండగా నిలబడి అందనంత ఎత్తు ఎదిగాడు.. అయితే సోనుసూద్ ని కొట్టారు.. చివరికి చిర్రెత్తిపోయిన సోనుసూద్అ అభియాని ఏం చేశాడో చూడండి.. అసలు సోను సూద్ ను కొట్టడం అనేదే తప్పు.. అందులోను అది నువ్వు న్యూస్ రాయడం ఇంకా తప్పు అనుకుంటున్నారా.. ఎదురుగా ఉంటే నన్ను కూడా కొట్టాలనిపిస్తుంది కాదు.. సరే మీకు ఏది అనిపించినా మీరు విన్నది నిజం.. అసలు విషానికి వెళ్దాం పదండి..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారానికి చెందిన చండపంగు గురవయ్య, పుష్పలత తమ ఏడేళ్ల కుమారుడు విరాట్‌తో కలిసి ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ వెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి టీవీలో సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో విలన్ అయిన సోనూసూద్‌ను హీరో కొట్టడంతో కోపంతో ఊగిపోయిన ఏడేళ్ల విరాట్ పక్కనే ఉన్న రాయి అందుకుని టీవీని పగలగొట్టేశాడు.
దీంతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు తేరుకుని టీవీని ఎందుకు పగలగొట్టావని ప్రశ్నించగా అతడు చెప్పిన సమాధానం వారిని మరింత ఆశ్చర్యపరిచింది. సోనూసూద్‌ను కొట్టడంతో తనకు కోపం వచ్చిందని, అందుకే టీవీని పగలగొట్టానని చెప్పడంతో వారు షాక్ తిన్నారు. ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో, ఆయన దీనిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సోను సూద్ అంటే మాములు విషయమా చెప్పండి.. అతని కోసం ఆ మాత్రం చేయాల్సిందే అని అది చూసిన స్థానికులు ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు
మాట్లాడుకుంటున్నారు..