బొత్స కుళ్ళు జోకు!
posted on Jul 6, 2024 @ 6:04PM
మొన్నటి ఎలక్షన్లలో చీపురుపల్లి ఓటర్లు చీపుళ్ళు, చేటలు పుచ్చుకుని కొట్టేసరికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి బుర్ర తిరిగిపోయినట్టుంది. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, కుళ్ళు జోకులు వేస్తున్నారు. అసలే ఈయన మామూలుగా మాట్లాడినా ఒక్క ముక్క కూడా అర్థం కాదు.. ఇక కుళ్ళు జోకులు కూడా వేస్తే, వినేవాళ్ళకి డోకులు తప్పనిసరిగా వస్తాయి. ఇంతకీ బొత్స వేసిన కుళ్ళు జోకు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయాలట. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకునే మాటలు ఎప్పటికప్పుడు జనం వినాలట. అప్పుడు అంతా పారదర్శకంగా, పలుగు దర్శకంగా వుంటుందట. వీళ్ళ నాయకుడు జగన్ అధికారంలో వున్నప్పుడు ఏనాడైనా మీడియాలో మాట్లాడిన దాఖాలు వున్నాయా? ఎప్పుడైనా రికార్డెడ్ వీడియోలు జనం మొహం మీద వేస్తారే తప్ప డైరెక్ట్.గా మాట్లాడిన సందర్భం ఏదైనా వుందా? పైగా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా జగన్ మీడియా ముందుకు వచ్చి, చంద్రబాబును నాలుగు తిట్లు తిట్టి, మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే పారిపోతున్నారు. అలాంటి పిరికివాడి నాయకత్వంలో వున్న బొత్స ఇలా మాట్లాడ్డం మరీ వింతగా వుంది.
బొత్స వేసిన ఈ కుళ్ళు జోకుకి మంత్రి అచ్చెన్నాయుడు ట్విట్టర్లో కౌంటర్ ఇస్తూ, ‘‘భలే జోకులేస్తున్నారు బొత్స గారూ.! పారదర్శకత గురించి మీరు, జగన్ మాట్లాడితే జనం నవ్విపోతారు.. వద్దులెండీ..! పారదర్శకతకు పాతరేసిందే మీరు. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు.. నౌ ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్... డోన్ట్ వర్రీ.. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.. సమావేశమయ్యాక.. అన్ని విషయాలూ తెలుస్తాయి’’ అన్నారు.