వరంగల్ సతీష్ చేతబడి మిస్టరీ వీడింది..
posted on Jun 12, 2021 @ 12:04PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన చేతబడి కాబడిన యువకుడి అదృశ్యం కేసు చివరకు చిక్కుముడి వీడింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చీమల సతీష్ (28) కి చేతబడి చేశారని, ఆ కారణంగానే సతీష్ అదృశ్యం అయ్యాడని భయబ్రాంతులకు గురైన స్థానికులు అతని కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఆచూకీ తెలవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గురువారం అదృశ్యమైన చీమల సతీష్ రాత్రి పడుకున్నాడు ఉదయం లేచి చూడగాలే అక్కడ అతను లేడు. అతను పడుకున్న చోట మంత్రాలకు సంబందించిన ముగ్గులు కనిపించాయి. సతీష్ పడుకున్న చోట ఆ ముగ్గులు ఉండడంతో అతనికి మంత్రాలు చేశారని అందుకే సతీష్ మాయమయ్యాడని అతని కుటుంబసభ్యులు స్థానికులు కంగారు పడ్డారు.. ఎక్కడ పడితే అక్కడ వెతికారు.. అయినా ఏం ఫలితం లేకపోయింది..
కట్ చేస్తే బస్టాండ్ వద్ద శుక్రవారం తిరగాడుతూ కనపడ్డాడు. ఇది గమనించిన ఉప్పరపల్లికి గ్రామానికి చెందిన వారు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సతిష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉన్నపలంగా చెప్పాపెట్టకుండా అదృశ్యమైన వ్యక్తి తిరిగి రావడంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా అసలు రాత్రి పడుకున్న వ్యక్తి అదృశ్యమవడం, పైగా మంచం పక్కనే మనిషి బొమ్మ ముగ్గు గీయడం, కుంకుమ, నిమ్మకాయల తో భయబ్రాంతులకు గురిచేసేలా చేసిన ఏర్పాట్లు ఎవరు చేశారు, సతీష్ ని తీసుకెళ్లిందేవరు.. రాత్రంతా సతీష్ ఎక్కడ ఉన్నాడన్న పూర్తి విషయాలు విచారణలో తేలనున్నాయి.
అందుకే మనకు కాళ్ళ ముందు కనిపించిందే వాస్తవం కాదు. వినుడగానెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపఁదగున్ అన్నారు. ఇది కూడా అంతే ఎవ్వడో ఏదో చెప్పాడని ఏదో చేశాడని వెంటనే నమ్మొద్దు.. సో.. ఆలోచించండి. అనవసరంగా నిర్ణయాలు తీసుకోకండి.. అనే నీతి ఈ వార్త ద్వారా తెలుస్తుంది..