భ్లాక్ ఫిలిం తీస్తే రోగాలే
posted on Oct 29, 2012 @ 12:06PM
భద్రతా కారణాలవల్ల కార్ల సైడ్ డోర్లకున్న బ్లాక్ ఫిలిం తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. అయితే నల్ల ఫిలిం తేస్తే స్కిన్ కేన్సర్లు, కంటి జబ్బులు, చర్మం వయసు పెరగటం (ఏజ్ స్కిన్) లాంటివి వస్తాయని కంటి డాక్టర్లు, స్కిన్ స్పెషలిస్టులు చెబుతున్నారు. అంటే అల్ట్రావయొలేట్ రేస్ వల్ల స్కిన్ ఎలర్జీ కూడా వస్తుందని చెబుతున్నారు. ఈ కిరణాలు సాధారణ అద్దాల నుండి 75 శాతం వరకు చోచ్చుకెళతాయని వారు చెబుతున్నారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ద్రువ పరచిందనికూడా అన్నారు. అయితే రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లే మహిళా ఉద్యోగులు మాత్రం తమకు భద్రత కరువైదని అందువల్ల తాము ప్రయాణించే క్యాబ్ లలో తప్పకుండా బ్లాక్ ఫిలిం తొలంగించాల్సిందే నంటూ కోరుతున్నారు. అయితే ఇప్పటికే తీసేసిన బ్లాక్ ఫిలిం కొన్ని రోడ్లమీద కుప్పలు కుప్పలుగా పడివుంది దీన్ని గనుక కాల్చితే విషపూరిత రసాయనాలు వాతావరణాన్ని కాలుష్యంతో నింపడమే కాక కేన్సర్ కు దారి తీస్తుందని కాబట్టి నగర పాలక సంస్దలు అందుకు సహకరించాలని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.