టి కాంగ్రెస్ గుస్సా
posted on Oct 29, 2012 @ 12:04PM
కేంద్ర మంత్రి వర్గంలో తమకు చోటు దక్కక పోవడం పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు మండిపడుతున్నారు. ముఖ్యంగా మందా జగన్నాదం నాలుగు సార్లు ఎంపిగా తాను గెలిచి నప్పటికీ ఎస్సీకోటాలో అధిష్టానం తనను గుర్తించనందుకు ఆగ్రహంగా ఉన్నారు. నిజమాబాద్ ఎంపి మధుయాష్కీ కూడా చెప్పుకోవడానికే రాహుల్ గాంధీ తన ప్రెండ్ అని గాని తనకు ఒరిగిందేమి లేదని గుర్రుగా ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. హైకమాండ్ విధేయతే గీటు రాయిగా ఉన్నందున తనకు బిసి కోటాలో పదవి ఖాయం లనుకున్నై వి హనుమంతరావు కూడా ఆశపడ్డారు కాని నిరాశే ఎదురయ్యింది. అలాగే నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్రెడ్డి, సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ హైకమాండ్ మీద ఆగ్రహంగా ఉన్నట్లు తెలుసింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం తెలంగాణ విషయంలో డిల్లీ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోనందుకే ఇలా జరిగిందని భావిస్తున్నారు. తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన కేశవరావు పరిస్థితి కూడా ఇలాగే వుంది. రాజ్యసభ సభ్యుడిగానూ నియమించకుండా సిడబ్లూసీనుండి కూడా తప్పించినట్లు పార్టీ నాయకులు తలపోస్తున్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే, తెలంగాణ తెచ్చేది మేమే అని ప్రగల్బాలు పలికిన తెలంగాణ ఎంపిల పై గుక్క తిప్పుకోని వేటు పడింది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గోన్న వారినెవరినీ అధిష్టానం ఖాతరు చెయ్యలేదు. ఇప్పుడు ప్రజలకు తాము ఏమి చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు