బీజేపీ మంత్రి సెల్ఫీల వ్యాపారం.. సెల్ఫీ కి వంద..
posted on Jul 19, 2021 @ 11:33AM
దేశంలో అన్ని రాజకీయ పార్టీల విధానాలు వేరుగా ఉంటాయి.. వాటి సిద్ధాంతాలు వేరు.. వారి వారి నినాదాలు వేరు.. ఇలా ఎవరి విధానాలు, ఎవరి సిద్ధాంతాలు, ఎవరి పంచాయితీలు వేరైతే.. వాటన్నింటికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. బీజేపీ నాయకులు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు గానీ మినిమమ్ అవగాహనా లేకుండా చేస్తారు.. అమ్మాయిలకు బాల్యవివాహాలు చెయ్యాలి.. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పడాల్సిందే అని మాట్లాడుతారు చివరికి వాళ్ళకే పడడానికి రాదు. ఇక దళితులు మనుషులు కాదు అన్నట్లు మాట్లాడుతారు.. ఇలాంటి కామెంట్స్ చేయడం ఒక్క బీజేపీకి మాత్రమే చెల్లుతుంది. ఇక తాజాగా ఒక బీజేపీ మహిళా మంత్రి ఒక వినుతన మైన విధానానికి తెరలేపింది. అదేంటో తెలుకుసోవాలనుకున్నారా.. అయితే పదండి బీజేపీ నాయకుల వింత పోకడలు చూద్దాం..
ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రముఖులు, నాయకులు ఎవరైనా కనిపిస్తే.. చాలామంది వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగడం కామన్.. ఇలాంటి సందర్భాల్లో అది వాళ్ళు కూడా స్వాగతిస్తారు. ఈమె బీజేపీ పార్టీ మంత్రి కదా కొంచం కాస్ట్ ఎక్కువ.. మనం వంద రూపాయలు వస్తువు కొంటే అనవసరంగా మన చేతి నుండి కట్టించుకునే జీఎస్టీ ఫైన్ లాగా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధరల లాగే..బీజేపీ నాయకులు చాలా కాస్ట్..
అయితే ఇలాంటి సందర్భాల్లో నాయకులు కొన్ని గంటల సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే.. తరచూ ఇలాంటి సమస్య ఎదురవుతుందని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలోని మహిళా మంత్రి కొంచెం వినూత్నంగా ఆలోచించి అభిమానులు, పార్టీ కార్యకర్తలకు షాకిచ్చారు. రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చంటూ ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఉషా ఠాకూర్ బహిరంగ ప్రకటన చేశారు.
ఈ మేరకు ఉషా ఖండ్వాలో మీడియాతో మాట్లాడారు. సెల్ఫీలు తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందంటూ ఆమె పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు గంటల కొద్ది ఆలస్యం అవుతుండటంతో.. పార్టీ పరంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నారు. ఎవరైతే సెల్ఫీలు తీసుకుంటారో వారు స్థానిక పార్టీ యూనిట్ కోశాధికారికి రూ.100 జమ చేయాలంటూ పేర్కొన్నారు. ఇలా సమకూరిన నగదును పార్టీ పనుల కోసం వినియోగించుకోవచ్చని ఆమె వెల్లడించారు.
దీంతోపాటు తనను బహిరంగ కార్యక్రమాలకు పిలిచే వారు పుష్పగుచ్ఛాలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని మంత్రి ఉషా ప్రజలకు సూచించారు. అలా అందిన పుస్తకాలతో పార్టీ కార్యాలయంలో లైబ్రరీని ఏర్పాటు చేయవచ్చంటూ అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ బీజేపీ మంత్రి ఇటీవల పలు సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు పీఎం కేర్స్ నిధి కోసం రూ.500 విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజల దగ్గర పన్నుల రూపంలో తీసుకుంటున్నది చాలదు అన్నట్లు.. మళ్ళీ కొత్త అవతారం ఎత్తారు మంత్రి గారు.. నియోజకవర్గానికి వచ్చే ఫండ్ తో కూడా చేయవచ్చు.. ఆమె ఆలా అన్నది అంటే నియోజక వర్గానికి వచ్చే ఫండ్స్ ఎక్కడికి పోతున్నట్లు..