సిఐడి పై నమ్మకం లేదు... సిబిఐకి అప్పగించండి
posted on Jun 9, 2020 @ 4:34PM
చిత్తూరుకు చెందిన దళిత మహిళా డాక్టర్ అనితా రాణి వైసిపి నాయకుల పై చేసిన ఆరోపణల పై సీఎం జగన్ సిఐడి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. స్థానిక ఆసుపత్రి లో దిగువ స్థాయి సిబ్బంది అవినీతి గురించి ప్రశ్నించడంతో కొంత మంది వైసిపి నేతలు తన పై కక్ష కట్టి వేధించారని దీని పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి రెండు నెలలు అయినా ఎవరు పట్టించుకోలేదని మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం తో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది.
తాజాగా దీని పై స్పందించిన ఆమె తనను వేధించింది వైసిపి నేతలు కావడం.. అలాగే సిఐడి రాష్ట్ర ప్రభుత్వ అధీనం లో పనిచేసే సంస్థ కావడం తో ఆ దర్యాప్తు పై తనకు నమ్మకం లేదని అందుకే హైకోర్టు ద్వారా సిబిఐ విచారణ కోరనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, ఇప్పటికే వైజాగ్ కు చెందిన డాక్టర్ సుధాకర్ కేసులో సిబిఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.