13 మంది సర్పంచుల రిజైన్.. సొంత జిల్లాలో జగన్ కు దిమ్మతిరిగే షాక్
posted on Nov 23, 2021 @ 4:14PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సొంత జిల్లాలోనే ఆయన వైసీపీ నేతలు ఝలక్ ఇచ్చారు. ఏకంగా 13 మంది సర్పంచులు వైసీపీకి రాజీనామా చేశారు. వైయస్సార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు.. పత్రికా ప్రకటన విడుదల చేశారు 13 మంది సర్పంచులు. సొంత సొంత గడ్డలో 13 మంది సర్పుంచులు రాజీనామా చేసిన ఘటన కడప జిల్లాతో పాటు ఏపీలో సంచలనంగా మారింది.
కడప జిల్లా ఖాజీపేట మండలంలో వైయస్సార్ పార్టీ కి మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల చేశారు 13 మంది సర్పంచులు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధపడ్డట్లుగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు సర్పంచులు.
ఖాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా 13 మంది సర్పంచులు ప్రత్యేకంగా సమావేశమై... కేవలం వైయస్సార్ పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు గా పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తమ గ్రామ పంచాయతీలలో వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతు లను, శానిటేషన్ కార్యక్రమం తో పాటుగా తదితర నిర్వహణ భారాలను బహిష్కరిస్తున్నట్లు గా పత్రికా ప్రకటనలో తెలియజేశారు.