ఎంపీ అవినాశ్ రెడ్డికి బిగ్ షాక్ 

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఏపీలో మరో షాక్ తగిలింది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.  నోటీసులను పులివెందుల పోలీసులు సర్వ్ చేశారు. నేడు కడప సైబర్ క్రైమ్ పోలీస్టేషన్లో హాజరు కావాలని నోటీసులిచ్చారు. పులివెందులలో రాఘవరెడ్డి నెలరోజుల తర్వాత ఆదివారం ప్రత్యక్షమయ్యాడు. వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి.. వర్ర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈనెల12వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలతో పులివెందులలో రాఘవరెడ్డి ప్రత్యక్షమయ్యాడు.
వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి  మంగళవారం కడపలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. వర్రా రవీందర్‌రెడ్డి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

Teluguone gnews banner