మన ఆహారంపైనే రక్త ప్రసారం ఆధార పడి ఉంటుంది

మీ శరీరంలో రక్త ప్రసారం అందాలంటే రక్త నాళాలు సరిగ్గా పని చేయాలంటే  మీ గుండెకు మెదడుకు , శరీర అవయవాలకు రక్త ప్రసారం సరిగ్గా జరగా లంటే 13 రకాల ఆహరం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు తీసుకునే ఆహారంపైనే రక్త ప్రసారం ఆధార పడి ఉంటుందని వివరించారు. మీ రక్త ప్రసారాన్ని పెంచే ఆరోగ్య కరమైన అలవాట్లు ఉండాలని అంటున్నారు.

రక్త ప్రసారం పెరగాలంటే...

రక్త ప్రసారం ద్వారా వచ్చే ద్రవం మనకు ఆక్షిజన్ ను ఇస్తుంది. ఇతర పౌష్టిక ఆహారాన్ని  మీ గుండెకు, మీ ఊపిరి తిత్తులకు శరీరం లోని ఇతర అవయవాలకు ఇస్తుందన్న విషయం మీకు తెలుసా?రక్త ప్రసారం బాగా జరగాలంటేపౌష్టిక ఆహారం న్యూట్రియాంట్స్ సరిగా అందడం అవసరం. ఏ ఆహారమై తే మీరు తీసుకుంటారో అది  రక్త సరఫరా పై ప్రభావం చూపుతుంది. మీ శరీరంలో రక్త ప్రసరణ పెరగాలంటే మీరు తినాలి. అందుకోసం మీరు  మీ ఆరోగ్యపు అలవాట్లు చేసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం శరీరపు బరువు తో పాటు ఆరోగ్యంగా ఉండడం అవసరం. మీరు ఒక వేళ పొగ తాగడం అలవాటు ఉంటె మానేయడం మంచిది. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపు అలవాట్లు చేసుకోడం వల్ల శరీరంలో రక్త నాళాలలో రక్త ప్రసారం ఆగకుండా  జరుగుతుంది. మీరు కొట్టుకు వెళ్లి నప్పుడు మీరు తీసుకునే ఆహారం మీ గుండె రక్త నాళాలు సంతోషాన్ని ఇచ్చేవి కొనుగోలు చేయాలి.

కారపు పొడి/లేదా ఆరంజ్ రెడ్ స్పైస్...

రెడ్ పెప్పర్ లేదా ఆరంజ్ రెడ్ స్పైస్ శరీరంలో రక్త ప్రసారాన్ని పెంచుతుంది. క్యాప్ సైసిన్ రెడ్ పెప్పర్ మీ కండరాలను రక్త నాళా లను రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల శరీరంలో సులభంగా రక్త ప్రసరణ జరిగి రక్తం పై ఒత్తిడిని తగ్గిస్తుంది.

బీట్రూట్...

బీట్రూట్ లో నైట్రేట్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది నైట్రేట్ ఆక్సైడ్ రక్త నాళాలు తెరుచుకుంటాయి. దీనివల్ల రక్త ప్రవాహం మరింత పెరుగు తుంది. అని ఒక పరిశోదనలో వెల్లడి అయ్యింది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల సిస్టోటిక్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుందని శాస్త్ర వేత్తలు కనుగొన్నారు. మొట్ట మొదటగా వచ్చే బీపి రీడింగ్ తరువాత వచ్చే బీపి రీడింగ్ చూసుకోవచ్చని తేల్చారు.

బెర్రీస్...

మీ రక్త ప్రసారాన్ని పెంచుకోడం తెలిస్తే ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ నేపద్యంలో బెర్రీస్  యంతో సియానిన్ అది యాంటి  ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇందులో రెడ్ అండ్ పర్పుల్ హ్యొస్ అంతో సియానిన్ అర్టిరీ వాల్స్ ను రక్త నాళాలు  పూర్తిగా మృదువుగా పని చేస్తాయి. ముఖ్యంగా అత్యంత ప్రమాద కరమైన లో బీపి నివారించేందుకు నైట్రిక్ యాసిడ్ ను విడుదల చేస్తుంది. 

ఫ్యాటీఫిష్...

గుండెకి ఆరోగ్యాని ఇచ్చేది చేప అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఫ్యాటీ ఫిష్ ఎందుకు?ఇందులో సాల్మన్,హెర్రింగ్, మాకర్ట్, ట్రవుట్, హాలిబట్, లలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. రక్త ప్రసారాన్ని పెంచే ఆహారంలో చేప ఒకటి. ఒక్క విషయం చెప్పాలంటే మీ గుండె ఆర్టరీ లను రక్తం గడ్డ కట్టకుండా 
ఆపుతుంది.

దానిమ్మ గింజలు...

దానిమ్మ పండులో ఉండే  దానిమ్మ గింజలు, టార్ట్ దానిమ్మ గింజలలో నైట్రేట్  చాలా విరివిగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. దానిమ్మ గింజలు  తీసుకోడం వల్ల ఆర్టరీ లు పూర్తిగా తెరుచుకుంటాయి దీని వల్ల రక్త ప్రసారం మరింత సులభంగా జరుగుతుంది.రక్త ప్రసారం మెదడుకు మరింత సులువుగా  చేరుతుంది. అలాగే గుండె ధమనులు, నరాలు ఇతర అవయవాలకు, చర్మం లోకి టి ష్యూలకు చేరుతుంది. ముఖ్యంగా అథ్లెట్లు దానిమ్మ గింజలు తినడం వల్ల అధిక రక్త  ప్రసారం తోపాటు శక్తి నిచ్చి, మరింత ఎక్కువసేపు పని చేయ గలదు. 

వెల్లుల్లి...

వెల్లుల్లి భారతీయ ఆహార వ్యవహారాలలో తర తరాలుగా ఇమిడి పోయింది. వెల్లుల్లి లో అత్యంత విలువైన అల్లిసిన్ లభిస్తుంది. వెల్లుల్లి వాడకం వల్ల రక్త నాళాలు కొంత ఉపశమనం పొందు తాయి. అందుకే చాలా మంది ఉదయం లేవగానే వెల్లుల్లి రెబ్బల్ని  తినడం వల్ల రక్త ప్రసారం పెరిగిందని  అంటూ ఉంటారు. దీనివల్ల గుండె నుండి రక్త ప్రసారం మరింత సులువుగా ప్రవహిస్తుంది. ఇది గుండె పని తీరుపై భారం పడకుండా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.అందుకే గుండెపై ఒత్తిడి పడినప్పుడుగుండె నుంచి రక్తం పంప్ చేయడం కష్టం. 

వాల్ నట్స్...

నట్స్ తినడం వల్ల అందునా ప్రత్యేకంగా వాల్ నట్స్ మీ గుండెకు రక్త నాళాల పై ఎంతో ప్రయోజనం ఉందని అంటున్నారు నిపుణులు. రక్త ప్రసారం చాలా మృదువుగా నెమ్మదిగా ప్రసరించడానికి సహకా రిస్తుంది. వాల్ నట్స్ ను ఎనిమిది వారాల పాటు తింటారో వారిపై జరిపిన పరిశోదన రక్త నాళాలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు గమనించారు. దీనివల్ల రక్త పోటు ను తగ్గించిందని  వారి రాక్త నాళాలు చాలా ఫ్లెక్స్ బుల్ గా పని చేసాయి.

ద్రాక్ష...

 అందరికీ ఇష్టమైన పండ్లలో ద్రాక్ష ఒకటి పర్పుల్ రంగు లో ఉండే ద్రాక్ష యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. రక్త నాళాలలోని గోడలు చాలా ప్రశాంతంగా సేద తీరుతాయి రక్త నాళాలు మరింత సమర్ధవంతంగా  బాగా పనిచేయ డానికి వీలు కలుగుతుంది ద్రాక్షలో ఉండే రసాయనాల్ వల్ల ఇంఫ్లామేషన్  లేదా రక్త హీనతను తగ్గిస్తుంది. దీనివల్ల రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. ద్రాక్ష తీయటి విందును అందిస్తుంది. రక్త ప్రసరణ కు సంబందించిన సమస్యలను సహకరిస్తుంది.

పసుపు...

పసుపు హిందీలో హల్దీ భాష ఏదైనా దని ఉప యోగం ఒక్కటే ఇది ఆరోగ్యాన్ని ఇచ్చే మూలిక అన్న విషయం దీని ఉపయోగాలు తెలుసుకుందాం. భారతీయులు నిత్యజీవితం లో శుభ కార్యాలలో ఆయుర్వేదం లో కీలక మైన యంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని నిపుణులు తేల్చారు. భారతీయ వంటకాలలో పసుపు  లేని వంట లేదంటే ఆశ్చర్యం కలిగించక మానదు.పసుపులో కుర్ కుమిన్  పదార్ధం నుంచి పసుపు నుంది లభిస్తుంది. పసుపు ద్వారా నైట్రిక్ ఆక్సైడ్  లెవెల్స్ ను పెంచుతుంది. రక్త నాళా లను వ్యాకొచం జరిగి రక్తం గుండెకు, మెదడుకు, శరీరంలోని అవయవాలకు  టిష్యు లకు చేరుతుంది.

బచ్చలి కూర...

మీకు హై బీపి ఎక్కువగా ఉంటె బచ్చలి కూర తీసుకోండిఇందులో నైట్రేట్స్  అధికంగా ఉంటాయి. మీశారేరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది.దీని వల్ల రక్త నాళాలు పోర్తిగా తెరుచుకుంటాయి. బచ్చలికూర ను తినడం వల్ల ఆర్ట్రీలు చాలా మృదువుగా ఉండి. బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి.    

నారింజ పండు - సిట్రస్ ఫ్రూట్...

ప్రజలు నారింజ పండును ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అయితే మీ జీవితంలో ప్రతిరోజూ నారింజ పండును తీసుకోడం వల్ల ఇంఫ్లామేషన్  తగ్గిస్తుంది. రక్త ప్రసారం సజావుగా జరగ డానికి తోడ్పడుతుంది. రక్త నాలాలలో వచ్చే క్లోట్ ను నివారిస్తుంది. ఒక పరిశోదన ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఆరంజ్ జ్యూస్ ప్రతిరోజూ తాగుతారో వారిలో రక్త పోటు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

చాక్లెట్...

చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే అయితే మీరు అదృష్ట వంతులే. చాక్లెట్ లో ఉండే వివిధ రకాల పదార్ధాలురక్త నాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. రక్త ప్రసారాన్ని సులభంగా సాగేలా చేస్తుంది. రక్త నాళాలను డ్రైలైట్  చేయడమే కాదు రక్త పోటును తగ్గిస్తుంది. రక్త పోతూ తక్కువ ఉన్నవాళ్లు డార్క్ చాక్లెట్లు తిన వచ్చు. మరీ ఎక్కువ తిన్నారంటే ఫ్యాట్ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.

 అల్లం...

చాలా మందికి అల్లం గురించి దానిప్రభావం గురించి పోర్తిగా తెలుసు. ముఖ్యంగా ఆహారం అరుగుదలకు అల్లం బాగా పని చేస్తుంది. కాస్త జలుబు, ఏమాత్రం నిసత్తువ నీరసం,బడలిక అల్లం తో చేసిన టీ తాగితే అకిక్ వేరని అంటారు టీ ప్రేమికులు. అల్లం రక్త నాళాలు తెరుచుకునేలా చేసి రక్తం ఒత్తిడిని తగ్గిస్తుంది.
అల్లం ఆశియాలో ముఖ్యంగా భారత్ లోని వంటింట్లో ప్రాధాన్ మూలిక. అల్లంటీ తీసుకుంటే వైరస్లు కాదు కాదు శరీరంలో ఉండే ఖప్పం పోతున్దన్న్ది నిజం.మీ స్వాస్కోశంలో ఉండే ఖపాన్ని అల్లం తీసేస్తుంది.

అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? ఈ నష్టాలు తెలుసా?

అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది. అంతే కాకుండా ఆహారాన్ని వేడి చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు.  ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, వంట చేయడానికి, ఆహారాన్ని తిరిగి వేడి చేయడానికి ఇలా చాలా రకాలుగా సిల్వర్ పాయిల్ వాడతారు. అయితే ఇన్ని రకాలుగా ఉపయోగించే సిల్వర్ ఫాయిల్ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని తెలుసా? అందరూ సిల్వర్ ఫాయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలో అనుకుంటారు. కానీ సిల్వర్ పాయిల్ ను వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అసలు సిల్వర్ ఫాయిల్ ను ఎందుకు వాడకూడదు? సిల్వర్ ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. అల్యూమినియం ఫాయిల్ ఎందుకు ప్రమాదం.. అల్యూమినియం ఫాయిల్ లో వేడి ఆహారం లేదా నిమ్మకాయ,  టమోటా లేదా స్పైసీ సాస్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలను ప్యాక్ చేసినప్పుడు అందులో మైక్రోస్కోపిక్ అల్యూమినియం కణాలు ఆహారంలోకి విడుదల అవుతాయి. ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు వాడినప్పుడు ఇలా విడుదల అయ్యే తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. దీని వల్ల అల్యూమినియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో సాధారణ స్థాయిల కంటే ఎక్కువ అల్యూమినియం ఉన్నప్పుడు అది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలు.. మెదడు, నాడీ వ్యవస్థ.. అల్యూమినియం ఒక న్యూరోటాక్సిన్. అంటే ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంలో అల్యూమినియం అధిక స్థాయిలో ఉండటం వల్ల మెదడు కణాలపై ప్రభావం పడుతుంది. మెదడులో అల్యూమినియం పేరుకుపోవడం వల్ల  అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం పెరగడం జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకలు, మూత్రపిండాలు.. శరీరంలో అల్యూమినియం అధికంగా చేరడం వల్ల కాల్షియం,  ఫాస్ఫేట్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎముక సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది.  ఇది ఎముక బలహీనతకు దారితీస్తుంది. మూత్రపిండాల ప్రాథమిక విధి శరీరం నుండి అదనపు అల్యూమినియంను తొలగించడం. కానీ అధిక అల్యూమినియం మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. వేడి, ఆమ్ల ఆహారం.. అల్యూమినియం లీచింగ్ అనేది ఉష్ణోగ్రత,  ఆహారం  స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిమ్మకాయ, టమోటా,  వెనిగర్ వంటి వేడి ఆహారం లేదా ఆమ్ల ఆహారాలను ఫాయిల్‌లో ప్యాక్ చేసినప్పుడు అల్యూమినియం కణాలు ఆహారంలోకి వేగంగా లీచింగ్ అవుతాయి. వంట కోసం ఫాయిల్ ఉపయోగించినప్పుడు కూడా ఈ లీచింగ్ తీవ్రమవుతుంది. ప్రత్యామ్నాయాలు.. అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లను ఉపయోగించాలి. ఫాయిల్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, చల్లని,  పొడి ఆహారాన్ని మాత్రమే ప్యాక్ చేయడం మంచిది.  ఆమ్ల ఆహారాలను అల్యూమినియం ఫాయిల్ తో డైరెక్ట్ గా టచ్ చేయకూడదు.  మరీ ముఖ్యంగా ఎల్లప్పుడూ ఫుడ్-గ్రేడ్ బటర్ పేపర్‌ను ఉపయోగించాలి. ఆ తరువాత దాన్ని సిల్వర్ పాయిల్ లో ప్యాక్ చేయాలి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఉప్పు ఎక్కువ తినకపోయినా బీపి ఎక్కువ ఉంటుందా? అసలు నిజం ఇదే..!

ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది.  భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది.  దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి.  గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం,  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.  అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది.  దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్   వంటివి తినేవారు చాలామంది ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు.  మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు.  కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు  శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం,  సుగర్ ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్,  చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా,  బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు,  ప్యాక్ చేసిన చట్నీలు,  ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు..   వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా  ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు,  బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ  మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు,  ఫ్లేవర్డ్ బటర్ లో  కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది.   అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం,  టెక్చర్ కోసం  కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి.   కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఆరోగ్యానికి మంచిది కదా అని పల్లీలు తెగ తినేస్తుంటారా? ఈ నష్టాలు తప్పవు..!

ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట.  పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.  100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట.  ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి.  పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం,  గ్యాస్,  కడుపులో యాసిడ్ ఫీలింగ్,  గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  దీన వల్ల శరీరంలో ఐరన్,  జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు,  ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది.  అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఈ చిన్న అలవాట్లే మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!

శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు.  మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు,  జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి.  ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది.  ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.  రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి.  ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం.. శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం.  ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామం.. శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. శ్రద్ద.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు.  ఇంటి పని చేసినా,  వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి. ప్రకృతి.. మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి.  తాజా గాలిలో,  సూర్యరశ్మిలో సమయం గడపడం,  మొక్కలు,  చెట్లు,  పక్షులు,  జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు. మనసు విప్పడం.. ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  వారిలో స్నేహితులు,  బంధువులు,  ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధాలు.. స్నేహం అయినా, ప్రేమ అయినా,  వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.  అందుకే బంధాలను కాపాడుకోవాలి.  ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి. నచ్చిన పని.. మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు,  ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆత్మ విమర్శ.. ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

డయాబెటిక్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే చాలా ఈజీగా షుగర్ వచ్చేస్తుంది..!

రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.   కేవలం తీపి పదార్థాలు,  స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు.  ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. డీప్ ఫ్రైడ్ స్నాక్స్.. సమోసాలు, పకోడాలు,  చిప్స్  ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్.  కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది.  బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం  ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను  పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది. మార్కెట్ ఫుడ్స్.. మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు  అనేక బ్రేకఫాస్ట్  తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు.   కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.  గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు,  రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రాసెస్డ్ మీట్.. సాసేజ్, బేకన్,  సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  నైట్రేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా   డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి,  జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి. డ్రింక్స్.. శీతల పానీయాలు,  ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో  ఉండే చక్కెర పరిమాణం కొన్ని  రోజులు తీసుకునే నేచురల్  చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి.  క్లోమంపై  ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి  సారి  శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రిపైండ్ ఫ్లోర్,  బ్రెడ్.. తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు,  నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో  ఫైబర్ ఉండదు.  దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్.. తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.  ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం,  రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

టీతో పాటు బిస్కెట్లు తింటున్నారా? దిమ్మ తిరిగే నిజాలు ఇవి..!

భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఈ టీ-బిస్కెట్ కాంబినేషన్ ను చాలా చెత్త కాంబో గా చెబుతున్నారు. టీ-బిస్కెట్ చాలా సింపుల్ గా రుచిగా అనిపిస్తుంది కానీ ఇది ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తుందని అంటున్నారు. అసలు టీ-బిస్కెట్లు తీసుకోవడం వల్ల జరిగేదేంటి? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుంటే.. టీ-బిస్కెట్ కహానీ.. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన బిస్కెట్లు ఎక్కువగా పాశ్చరైజ్ చేయబడతాయి. వాటిలో శుద్ధి చేసిన పిండి అంటే మైదా, అధిక మొత్తంలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు,  అనేక ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఈ  పదార్థాలు టీలోని కెఫిన్,  టానిన్‌లతో కలిపినప్పుడు అది జీర్ణక్రియను చాలా  ప్రభావితం చేస్తుంది. శరీరంలో అనవసరమైన చక్కెర,  కొవ్వు పేరుకోవడాన్ని  పెంచుతుంది. టీ-బిస్కెట్ తినడం అనేది రోజువారీ అలవాటుగా మారితే  అది ఊబకాయం, మధుమేహం  జీర్ణ సమస్యల ప్రమాదాన్ని చాలా సులువుగా  పెంచుతుంది. పోషకాలు జీరో.. మార్కెట్లో దొరికే బిస్కెట్లు మైదా నుండి తయారవుతాయి.  వీటిలో  ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు ఏమీ ఉండవు.ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. టీతో వాటిని తినడం వల్ల అప్పటిక్పుడు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పోషకాహారం ఏమీ ఉండదు. ట్రాన్స్ ఫ్యాట్స్.. బిస్కెట్లను క్రిస్పీగా చేయడానికి,  వాటి షెల్ఫ్ లైప్  పొడిగించడానికి హైడ్రోజనేటెడ్ నూనెలు లేదా ట్రాన్స్ ఫ్యాట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ట్రాన్స్ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ కొవ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చక్కెర .. బిస్కెట్లలో చక్కెర,  శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని టీతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఆపై పడిపోతాయి. ఈ హెచ్చుతగ్గులు ఎక్కువగా జరిగితే అవి  శక్తి లేకపోవడానికి దారితీయడమే కాకుండా, దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. జీర్ణక్రియ, యాసిడ్.. బిస్కెట్-టీల కాంబో  జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. శుద్ధి చేసిన పిండిలో ఉండే  జిగట,  టీలోని టానిన్లు కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.  టీలోని ఆమ్లతత్వం,  బిస్కెట్లలోని నూనె కడుపులో గ్యాస్, ఉబ్బరం,  యాసిడ్ ఎఫెక్ట్ ను ఎక్కువ  చేస్తాయి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వందేళ్లకు పైగా బ్రతకడానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!

  ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు.  ఆయుష్షును పెంచడానికి ఎటువంటి మాయా సూత్రం లేదని,  ఇప్పటికీ కొన్ని పురాతన ఆయుర్వేద పద్ధతులను ఆచరించడం ప్రారంభిస్తే వంద సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విషయాన్ని స్వయంగా  చరక మహర్షి శిష్యుడైన  వాగ్భటాచార్యుడు  చెప్పారు. ఆయన ఆయుర్వేదంలో కొన్ని పద్దతులను వివరించాడు. వీటని పాటించడం వల్ల వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడం సాధ్యమట.  ఇంతకీ ఆ రహస్య చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. భారతదేశ జనాభా దాదాపు 1.4 బిలియన్లు అయితే.. అందులో కేవలం 300 మిలియన్లు మాత్రమే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన వారు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, కీళ్ల నొప్పులు,  వాత-పిత్త-కఫ సమస్యలు వంటి వివిధ వ్యాధులతో బాధపడుతున్నారట. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా వారికి వచ్చే  85 శాతం అనారోగ్యాలకు స్వయంగా చికిత్స చేసుకోగలరని, కేవలం  15 శాతం అనారోగ్యాలకు మాత్రమే నిజంగా వైద్యుడు అవసరమవుతారని వాగ్భటాచార్యుడు పేర్కొన్నారు. తాగునీరు.. 3 నియమాలు.. ప్రతిరోజూ నీరు తాగుతాము, కానీ సరైన రీతిలో త్రాగడం కూడా అంతే ముఖ్యమని వాగ్బటాచార్యుడు చెప్పాడు.  మొదటి నియమం.. తిన్న వెంటనే నీరు త్రాగకూడదు, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. రెండవ  నియమం.. నీటిని ఎల్లప్పుడూ గుటకలుగా త్రాగాలి. కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలి. నీటిని  గ్లాసు లేదా చెంబు, బాటిల్ తో ఎత్తుకుని ఒక్కసారిగా ఎక్కువ మొత్తం తాగడం  ఆరోగ్యానికి మంచిది కాదు. మూడవ నియమం.. చల్లటి నీరు ఎప్పుడూ త్రాగకూడదు. చాలా చల్లటి నీరు కడుపులోని అగ్నిని బలహీనపరుస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఆటంకం కలిగిస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగడం ఎల్లప్పుడూ ఉత్తమంగా పరిగణించబడుతుంది. నిద్ర లేచిన వెంటనే నీరు.. ఉదయం నిద్ర లేచిన వెంటనే నోరు శుభ్రం చేసుకోకుండా నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ లాలాజలం శరీరం లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉదయం ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  శరీరం విష పదార్థాలను తొలగిస్తుంది. ఆహారం, సమయం.. వాగ్భటుడు చెప్పిన దాని ప్రకారం సూర్యోదయం తర్వాత రెండున్నర గంటల పాటు శరీరం యొక్క జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. ఉదాహరణకు.. సూర్యుడు ఉదయం 7 గంటలకు ఉదయిస్తే శరీరం యొక్క జీర్ణశక్తి ఉదయం 7:00 నుండి  9:30 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో తినే ఆహారం బాగా జీర్ణమవుతుంది,  పూర్తి పోషణను అందిస్తుంది. అందువల్ల ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం కొంచెం తక్కువగా, రాత్రి తేలికైన భోజనం తినాలని ఆయన సలహా ఇచ్చారు. ఇష్టమైన ఆహారం, నియమాలు.. చాలామందికి ఇష్టమైన ఆహారాలు అంటూ  పరాఠాలు, స్వీట్లు, రబ్రీ, రసగుల్లాలు లేదా ఏదైనా భారీ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు  ఇష్టమైన ఆహారాన్ని ఉదయం తినాలట. ఉదయం  జీర్ణశక్తి చాలా బలంగా ఉంటుంది.  బరువైన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అయితే, రాత్రిపూట అదే ఆహారాలు తినడం వల్ల ఊబకాయం, గ్యాస్,  అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారం ఇలా ఉండాలి.. ఆహారం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా మానసిక సంతృప్తికి కూడా అవసరమని వాగ్భటాచార్యులు  అన్నారు. మనస్సు సంతృప్తి చెందినప్పుడు శరీరం సరైన మొత్తంలో హార్మోన్లు,  ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిరాశ,  మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది.  శరీరం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వారెవ్వా మందారం టీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.

బలమైన గుండె కావాలా? ఇవి తినండి చాలు..!

శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది.   అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె  బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది.  అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు.  గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే.. గుండెను బలంగా ఉంచే ఆహారాలు.. సాల్మన్.. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే  ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA,  DHA లను అందిస్తాయి.  ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు   తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్.. ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన  కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.  రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఆలివ్ నూనె తీసుకోవడం  వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అవకాడో.. అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్,  విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్,  రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి. వాల్నట్స్. క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్‌నట్‌లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.  రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు,  పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట. ముదురు ఆకుకూరలు.. ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.  సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

నెల రోజుల పాటు టీ మానేసి చూడండి.. షాకవుతారు..!

భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి,  అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా,  ఫుడ్ లేటయినా కనీసం టీ  అయినా తాగాలి.  ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు.  మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి,  ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. నెలరోజులు టీ తాగడం మానేస్తే.. ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి  హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్,  ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి  రీసెట్ బటన్ గా పనిచేస్తుంది. నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే  నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ.. టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి,  అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్,  టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట,  అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఐరన్ శోషణ.. టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో  ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం.. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల  నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది. గాఢంగా,   నాణ్యమైన నిద్రను పొందడంలో  సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం,  ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, దంతాల ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి  దంతాల  రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా  దంతాలు శుభ్రంగా,  ప్రకాశవంతంగా కనిపిస్తాయి.  శరీరం హైడ్రేషన్ గా ఉండటం,  వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల  పొడిబారడం తగ్గుతుంది.  చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...