తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే కలిగే లాభాలు ఇవే..!

 

తేనె సహజమైన తియ్యని పదార్థం.  దీన్ని సంస్కృతంలో మధు అని పిలుస్తారు.  ఆయుర్వేదం తేనెను గొప్ప ఔషదంగా పేర్కొంది. తేనెను  ప్రతి రోజూ తీసుకుంటే చాలా రకాల వ్యాధులు నయం అవుతాయి.  తేనెలో సహజమైన చక్కెరలు ఉండటం మూలాన ఇది శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు. ఇక డ్రై ఫ్రూట్స్ గురించి అందరికీ తెలిసిందే.. డ్రై ఫ్రూట్స్ శరీరానికి శక్తిని, ఆరోగ్యకరమైన కొవ్వులను ఇస్తాయి.  డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి దీర్ఘకాల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.  అలాంటి డ్రై ఫ్రూట్స్ ను తేనెలో నానబెట్టి తింటే శరీరానికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయట.

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాు పుష్కలంగా ఉంటాయి.  తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టైతే అలాంటి వారు తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తినాలి.  ఇది చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో సహాయపడుతుంది.  ప్రతి రోజూ కనీసం ఒక స్పూన్ తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినాలి.

తేనె, డ్రై ఫ్రూట్స్ రెండూ శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి.  అలసిపోయినప్పుడు తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే అలసట నుండి ఉపశమనం పొందవచ్చు.  నీరసంగా అనిపించినా, అలసటగా ఉన్నా,  శరీరంలో శక్తి లేనట్టు అనిపించినా తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది,

తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.  జీర్ణ శక్తి బలహీనంగా ఉన్నవారు తేనెలో నానబెట్టిన డ్రై ప్రూట్స్ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది అమృతంతో సమానమైన ఔషధంగా పనిచేస్తుంది.


                                                    *రూపశ్రీ.

Teluguone gnews banner