వెడ్డింగ్ షూట్ లో ఎలుగుబంటి వేట
posted on Dec 17, 2022 @ 10:04AM
అడవిలో జంతువులు తమ ఆహారం కోసం వేటాడే దృశ్యాలు ఎప్పుడూ అబ్బుర పరుస్తూనే ఉంటాయి. చిరుత జింకను వేటాడే దృశ్యాలను ఏనిమల్ ప్లానెట్ లో తిలకించడంలోని థ్రిల్లే వేరు. అయితే ఎలుగుబంట్లు వేడాటే దృశ్యాలు సాధారణంగా ఎక్కడా పెద్దగా కనిపించవు. అయితే వెడ్డింగ్ షూట్ కోసం అడవికి వెళ్లిన జంటకు ఈ అరుదైన ఎలుగుబంటి వేట ఎదురైంది. అంతే తమ వెడ్డింగ్ షూట్ ను పక్కన పెట్టేసి ఎలుగుబంటి వేటను చిత్రీకరించారు.
పెళ్లికి ముందు కాబోయే భార్యా భర్తలకు వెడ్డింగ్ షూట్ ఒక మరపురాని మధురానుభూతి. అందుకే ప్రతి జంటా కూడా తమ వెడ్డింగ్ షూట్ ను వినూత్నంగా ప్లాన్ చేసుకుంటారు. అలాగే ఓ జంట కూడా తమ వెడ్డింగ్ షూట్ కు అడవిని ఎంచుకున్నారు. అలా అడవిలో ఓ చెరువు గట్టున తమ వెడ్డింగ్ షూట్ జరుపుకుంటుంటే.. సరిగ్గా అదే సమయంలో ఓ ఎలుగుబంటి దుప్పిని వేటాడుతూ అక్కడకు వచ్చింది. అంతే వెంటనే ఆ జంట తమ వెడ్డింగ్ షూట్ ఆపేసి ఎలుగుబండి వేటను చిత్రీకరించారు.
ఆ వీడియోను నెట్టింట పోస్టు చేయగానే వైరల్ అయ్యింది. ఆ జంట అదృష్టమే అదృష్టం.. అద్భుతమైన, అరుదైన వేటను లైవ్ లో తిలకించారని కొందరంటుంటే.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లి ఎలుగుబంటి వేటను చిత్రీకరించారా అంటే సరదా కామెంట్లు చేస్తున్నారు.