కరోనా వ్యాక్సిన్ తయారీలో బీసీఎం తో బీఈ ఒప్పందం
posted on Aug 14, 2020 @ 5:50PM
కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ తయారుచేసేందుకు చాలా ఫార్మాకంపెనీలు పరశోధనలు చేస్తున్నాయి. ప్రపంచంలోని జనాభా మొత్తానికి సరిపోవాలంటే ఒక దేశమో.. ఒక సంస్థనో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తే సరిపోదు. అందుకే ఫార్మా రంగం అభివృద్ధి చెందిన ప్రతిదేశంలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ తయారీలో ముందుకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేసేందుకు యూఎస్‌కు చెందిన బేలర్ కాలేజి ఆఫ్ మెడిషిన్(బీసీఎం)తో హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ బయోలాజికల్–ఈ లిమిటెడ్(బీఈ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బీసీఎం డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ ను పెద్ద మొత్తంలో ఉత్తత్పి చేయడానికి బీఈకి వీలుంటుంది. ఈ వ్యాక్సిన్ ను బీఈ మరింతగా అభివృద్ధి చేసి అందుబాటు ధరల్లో మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు బీసీఎంతో కుదుర్చుకున్న ఒప్పందం సాయపడుతుందని బీఈ మేనేజింగ్ డైరక్టర్ మహిమా దాట్ల అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పై ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
కోట్లాది మందికి సోకి లక్షలాది మంది మరణానికి కారణం అవుతున్న కరోనాను ఎదుర్కొన్న వ్యాక్సిన్ సురక్షితమైన, అందరినీ అందుబాటు ధరలో ఉండేలా తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న భారత్ బయోటెక్ లీటర్ వాటర్ కన్నా తక్కువ ధరలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని అంటుంది. సామాన్యలకు సైతం అందుబాటులో ఉండే ధరలో ఈ వ్యాక్సిన్ త్వరగా రావాలని ప్రపంచ మానవాళీ ఎదురుచూస్తోంది.