ఆస్కార్ కి బర్ఫీ సినిమా ఎంపిక
posted on Sep 23, 2012 @ 12:05PM
బర్ఫీ సినిమా ఆస్కార్ అవార్డ్స్ 2012 సంవత్సరానికిగానూ నామినేట్ అయింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ జ్యూరీ చైర్‌పర్సన్ మంజు బోరా హైదరాబాద్‌లో ప్రకటించారు. "ఆస్కార్‌కు భారతీయ చిత్రంగా 'బర్ఫీ'ని నామినేట్ చేస్తున్నాం. సినిమాలోని విషయం, నాణ్యత ఆధారంగా ఈ చిత్రాన్ని ఎంపిక చేశాం'' అని ఆమె చెప్పారు. ఈ సారి హిందీ, గుజరాతి, మరాఠీ, మలయాళం, తమిళ్, తెలుగు నుంచి 20 సినిమాలొచ్చాయి. తెలుగు నుంచి 'ఈగ'ను కూడా పరిశీలించాం. మేం చూసిన 20 సినిమాల్లో దాదాపు 18 మనసుకు నచ్చాయి. మా సభ్యులందరూ కలిసి చర్చించి 'బర్ఫీ'ని నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నాం.'' అని మంజు బోరా అన్నారు.