కేంద్రం మాట నిలబెట్టుకోవాలి.. బాలకృష్ణ
posted on Aug 15, 2015 @ 12:35PM
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక హోదాపై స్పందించారు. ఈ రోజు స్వాంతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆయన తన నియోజకవర్గమైన హిందూపురంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఎంజీఎం గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోయిందని.. అలాంటి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తను ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాదు హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని.. ప్రజలంతా సోదరభావంతో మెలగాలని బాలయ్య పిలుపునిచ్చారు.