ఎన్నికలకు ముందే జగన్ కు పరాభవం తప్పదా?
posted on Jan 14, 2024 @ 12:52PM
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే జగన్ పార్టీకి బ్యాడ్ టైమ్.. తెలుగుదేశం పార్టీకి గుడ్ టైమ్ స్టార్ట్ అయిపోయింది. మరో రెండు మూడు నెలల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలే అందుకు వేదిక కానున్నాయని అంటున్నారు. ఏపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మామూలుగా అయితే అంటే అసెంబ్లీలో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే ఆ మూడూ కూడా జగన్ పార్టీకే దక్కాల్సి ఉంది. అయితే ఇప్పుడు జగన్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీకే ఓటు వేస్తారన్న నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదు. ఇందుకు కారణం పెద్ద సంఖ్యలో సిట్టింగులను మార్చేస్తూ తీసుకుంటున్న నిర్ణయమే కారణం.
ఇప్పటికే పలువురు సిట్టింగులు జగన్ కు గుడ్ బై చెప్పేశారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. టీడీపీకి అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో వైసీపీ గూటికి ఎప్పుడో చేరిపోయారు. అయితే గత ఏడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో అప్పట్లో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతూ జగన్ ఆ నలుగురినీ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడా నలుగురూ తెలుగుదేశంకు చేరువయ్యారు. దీంతో అసెంబ్లీలో టీడీపీ బలం 23కి చెరింది. ఇక జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నా.. ఇప్పుడాయన వైసీపీలో ఉన్నారు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే రాజ్యసభకు ఎంపిక కావాలంటే.. 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అది జగన్ పార్టీకి సంపూర్ణంగా ఉంది. అంటే.. 151 మంది ఎమ్మెల్యేల ఉన్నారు.
కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. జగన్ నిర్ణయాలు, వైఖరి కారణంగా కారణంగా.. పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోది. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి ఎమ్మెలంతా.. గంపగుత్తగా తెలుగుదేశం బరిలో దింపిన రాజ్యసభ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలో పంచుమర్తి విజయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దీంతో వచ్చే రాజ్యసభ ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు బరిలో నిలిస్తే వారికి జాక్ పాట్ తగిలినట్లేననీ, విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు జస్ట్ రోజుల ముందు జరిగే రాజ్యసభ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందితే మాత్రం.. సినిమా రిలీజ్‌కు ముందే ట్రైలర్ విడుదలై.. సూపర్ డూపర్ హిట్ కొట్టినట్లేననడంలో సందేహం లేదు. జగన్ అధికారంలో ఉండగానే.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో.. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కోటాలో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు గెలుపొందారు.
అలాగే పార్టీలోని అసంతృప్తి కారణంగా.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. అదే విధంగా త్వరలో జరగనున్న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో జగన్ పై అసంతృప్తితో వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ అభ్యర్థులు జాక్ పాట్ కొట్టడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.