త్వరలో తెరపడనున్న 134 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న అయోద్య వివాదం...
posted on Oct 17, 2019 @ 2:04PM
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పు పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది, నూట ముప్పై నాలుగు ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాదానికి త్వరలో తెరపడనుంది. నవంబర్ 17 లోగా తుది తీర్పు రానుంది, చివరి రోజు కూడా అత్యున్నత న్యాయస్థానంలో వాడి వేడిగా వాదనలు జరిగాయి.
సుప్రీంకోర్టులో అయోధ్య వివాదంపై వాదనలు ముగిశాయి, ఇక తీర్పు పైనే అందరి కళ్ళు ఉన్నాయి, నలభై రోజుల పాటు కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెట్టింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ వాదనలు సాగాయి.
అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం విషయంపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయ్యింది. వాదనల చివరి రోజు సర్వోన్నత న్యాయస్థానంలో హైడ్రామా చోటుచేసుకుంది. విచారణలో భాగంగా హిందూ మహాసభ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ అయోధ్య రీవిజిటెడ్ అనే పుస్తకాన్ని కోర్టు ముందుంచగా, సున్నీ వర్క్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పుస్తకాన్ని సమర్పిస్తే చించేస్తామని హెచ్చరించారు. అయినా వికాస్ సింగ్ తన వాదనలు వినిపిస్తుండగా రాజీవ్ ధావన్ జోక్యం చేసుకొని ఆ పుస్తకాన్ని చించేశారు.
దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అయోధ్య రీవిజిటెడ్ పుస్తకాన్ని చింపటాన్ని సమర్ధించుకున్నారు సున్నీ వర్క్ బోర్డు లాయర్ రాజీవ్ ధావన్. చీఫ్ జస్టిస్ అనుమతి తోనే అలా చేసినట్టు స్పష్టం చేశారు.
అయోధ్య రీవిజిటెడ్ అనే పుస్తకాన్ని కిషోర్ గుణాల్ రచించారు. వివాదస్పద స్థలంలో రామ మందిరం ఉందని, దీనికి సంబంధించిన మ్యాప్ ను కూడా పుస్తకంలో పెట్టారు. అయితే ఈ పుస్తకాన్ని సాక్ష్యంగా తీసుకోవాలన్న పిటిషన్ ను న్యాయస్థానం రెండు వేల పద్ధతులనే తోసిపుచ్చిందన్నారు ముస్లిం సంస్థలు తరపు న్యాయవాది రాజీవ్ ధావన్.
సున్నీ వర్క్ బోర్డు తరఫున ఆయన తుది వాదనలు వినిపించారు, అయోధ్యలో వివాదాస్పద స్థలంపై హిందు సంస్థల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయన్నారు ధావన్. అక్కడ ఆలయం ఉందని హిందూ సంస్థలు నిరూపించలేక పోయాయి అని అన్నారు. నాలుగు వందల ఏళ్ల నుంచి వివాదస్పద స్థలంలో మసీదు ఉన్నట్టు ఆధారాలున్నాయని చెప్పారు. ఆ స్థలాన్ని సున్నీ వర్క్ బోర్డుకు అప్పగించాలని డిమాండ్ చేశారు