గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికుల నేతలు.....

 

 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మే పదమూడవ రోజుకు చేరింది. ఒకపక్క ఉప ఎన్నికలు ఉత్కంఠం మరోపక్క ఆర్టీసీ సమ్మేతో కేసీఆర్ తీవ్ర ఒత్తిడికి లోనైతున్నారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.హైకోర్ట్ కూడా ఎట్టి పరిస్థితిలో ఈ రెండు రోజుల్లో చర్చలు జరిపి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మండి పడింది. సమ్మే పై ఒకొక్కరు ఒకొక్క విమర్శలు చేస్తున్నారు. కొందరు నేతలు సమ్మేకి  మద్దత్తు కూడా తెలుపుతున్నారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాల కార్యకర్తలు గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.

సీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అటు నిర్మల్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కార్మికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అదుపు లోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బస్సు సర్వీసును పునరుద్ధరించారు. జయశంకర్ భూపాలపల్లి ఆర్టీసీ డిపో దగ్గర కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్ లకు దండం పెడుతూ విధులకు రావొద్దని వేడుకున్నారు. తమ పొట్టకొట్టవద్దని కుటుంబ సభ్యులతో సహా వచ్చి కోరారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.ఇక ఈ సమ్మే ఎప్పటికి ఎలా పరిష్కారమవుతుందో వేచి చూడాలి.  
 

Teluguone gnews banner