సీజేఐ గవాయ్‌పై దాడికి యత్నం!
posted on Oct 6, 2025 @ 1:57PM
సీజేఐ గవాయ్ పై సుప్రీం కోర్టులోనే దాడిక యత్నం జరిగింది. ఈ దాడికి ప్రయత్నించినది సుప్రీం కోర్టు న్యాయవాదే కావడం విశేషం. సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనంలో సోమవారం (అక్టోబర్ 6() కేసు విచారణ జరుగుతుండగా ఒ లాయర్ ఆయనపై దాడికి ప్రయత్నించారు.
చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై చెప్పు విసిరారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. లాయర్ విసిరిన చెప్పు జస్టిస్ గావాయికి తగలలేదు. ఈ ఘటన తరువాత జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ఇటువంటి దాడులకు భయపడేది లేదని అన్నారు. జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నించిన న్యాయవాదిని రాకేష్ కిషోర్ గా అని గుర్తించారు. అయితే ఆయన చీఫ్ జస్టిస్ పై దాడికి పాల్పడడానికి కారణమేంటన్నదానిపై స్పష్టత లేదు.
అయితే ఇటవల ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ దేవుడిని అడగండి అని వ్యాఖ్యానించారనీ, అలా వ్యాఖ్యానించడం ద్వారా జస్టిస్ గవాయ్ సనాతనాన్ని కించపరచడంగా భావిస్తూ రాకేష్ కిషోర్ ఈ దాడికి ప్రయత్నించి ఉంటారని కొందరు అంటున్నారు. కాగా చీఫ్ జస్టిస్ పై దాడికి ప్రయత్నించిన రాకేష్ కిషోర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం సుప్రీం కోర్టు కార్యకలాపాలు యాథావిథిగా కొనసాగాయి.