ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

 

 

 

 

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 14 జిల్లాలో ఆరు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో 6.32 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. ఎన్నికల కోసం 1437 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల స్థానాలకు 64 మంది, ఉపాధ్యాయ స్థానాలకు 19 మంది పోటీపడుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.


ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ లైవ్ వెబ్‌కాస్టను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటరు గుర్తింపు కార్డులు లేని వారు ఫోటోతో ఉన్న 15 రకాల గుర్తింపు కార్డులను చూపి ఓటు వేయవచ్చు. ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఆరుగురు ఐఎఎస్ అధికారులను ఈసీ నియమించింది. ప్రత్యేక పోలీసు బలగాలు, మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. 25న ఉదయం 8 గంటలకు ఆరు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Teluguone gnews banner

Jubilee Hills byelection

జూబ్లీ ఉప ఎన్నిక.. మంత్రులకు కీలక బాధ్యతలు

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. యూసఫ్ గూడ డివిజన్  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్  రహమత్ నగర్ డివిజన్‌కు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంగల్ రావు నగర్ డివిజన్‌‌కు  తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సోమాజిగూడ డివిజన్‌‌కు   శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్  బోరబండ డివిజన్ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి  షేక్ పేట్ డివిజన్‌‌కు  కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి ఎర్రగడ్డ డివిజన్‌‌కు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు ప్రచార బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు జూబ్లీ బైపోల్  కీలక దశకు చేరుకున్నది. ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీల నేతలూ చెమటోడుస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.  మరోవైపు బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు దానిని మరింత ముమ్మరంచేసింది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్‌, హరీశ్‌ రావు గత వారం రోజులుగా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది.    

తుపాను వేళ.. జగన్ ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులకు మంగళవారం (అక్టోబర్ 28) ఓ పిలుపు నిచ్చారు. మొంథా తుపాను సమయంలో బాధితులకు అండగా నిలవాలి, సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలన్నది ఆ పిలుపు సారాంశం. సరే  రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు ప్రజలకు అండగా ఉండాలన్న పిలుపునివ్వడం ముదావహం. కానీ ఇంతకీ ఆ పిలుపునిచ్చిన నాయకుడు ఎక్కడున్నారు? రాష్ట్రాన్ని పెను తుపాను అతలాకుతలం చేస్తుంటే.. దగ్గరుండి పార్టీ శ్రేణులకు సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనేలా దిశా నిర్దేశం చేయాల్సిన ఆయన రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడకుండా.. బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతిగా కూర్చుని పార్టీ నేతలూ, శ్రేణులను సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలంటూ పిలుపునచ్చి చేతులు దులిపేసుకోవడమేంటని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు బెంగళూరు వెళ్లారు. ఆయన ముందుగా నిర్ణయించిన మేరకు మంగళవారం (అక్టోబర్ 28)కి తాడేపల్లి రావాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూలత కారణంగా విమానాలు రద్దు కావడం వల్ల రాలేకపోతున్నారంటూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ.. శుక్రవారం నుంచే రాష్ట్రాన్ని పెను తుపాను ముప్పు ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఆదివారం (అక్టోబర్ 26)నాటికి అయితే తుపాను తీవ్రత అధికంగా ఉండబోతోందన్న క్లారిటీ కూడా వాతావరణ శాఖ ఇచ్చేసింది. తుపాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందనీ ప్రకటించింది. అంటే జగన్ కు  తుపాను సహాయ కార్యక్రమాలలో పాల్గొనే విషయంలో సీరియస్ నెస్ ఉంటే.. ఆదివారమే బయలుదేరి తాడేపల్లికి చేరుకోవచ్చు. కానీ మంగళవారం వరకూ అంటే తుపాను తీరం దాటే రోజు వరకూ బెంగళూరులోనే ఉండిపోయారు. ఇప్పుడు తీరిగ్గా విమానాలు రద్దయ్యాయి కనుక రాలేకపోతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేయించారు.  అయితే జగన్ తీరు తొలి నుంచీ ఇదే విధంగా ఉందనీ, గతంలో కూడా ఆయన విపత్తు సమయంలో కాకుండా, ఆ తరువాత అంతా సర్దుమణిగాకా ఆర్భాటంగా పరామర్శ యాత్రలు చేసే వారనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఆయన సీఎంగా ఉన్న సమయంలో విపత్తులు సంభవించిన సమయాలలో కూడా ఆయన తీరిగ్గా వీలు చూసుకుని ఓ సారి వెళ్లి పరామర్శించి రావడం తప్ప సహాయ పునరావాస కార్యక్ర మాలను పర్యవేక్షించి, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన సందర్భం లేదని అంటున్నారు.

ఆంధ్రా ఫస్ట్.. చంద్రబాబు బెస్ట్!

నాలుగు దశాబ్దాలకు పైబడిన ప్రజా జీవితంలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి అనితర సాధ్యమనదగ్గ విజయాలను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడిని రాజకీయ వైరంతో విమర్శలు చేసే వారు ఉంటే ఉండొచ్చు కానీ, దార్శనికత, పాలనా దక్షతకు సంబంధించి ఆయనను వేలెత్తి చూపేవారెవరూ దాదాపు ఉండరనే చెప్పాలి. ఎప్పుడో.. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వమే..  కొండలు గుట్టల నడుమ చంద్రబాబు నాయుడు  ముందు చూపుతో  నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై ఇప్పుడు సైబరాబాద్ గా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆ నాడు చంద్రబాబు విజన్  యువత  భవితకు బంగరు బాటలు పరిచింది. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు.. కాదనలేరు.  నిజానికి ఐటీ అంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పడూ కూడా చంద్రబాబే గుర్తుకు వస్తారు.  చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి. రాజకీయ విభేదాలతో ఆయన ఘనతను పొలిటీషియన్లు బాహాటంగా అంగీకరించకపోవచ్చు.. కానీ మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని అధికారులు, అందులోనూ కేంద్రంలో ఉన్నత స్థాయిలో  వివిధ విభాగాలకు అధిపతులుగా పని చేసిన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతకు ఫిదా అవ్వడమే కాదు.. పదవీ విరమణ తరువాత వారి ఆత్మకథలలో చంద్రబాబు విశిష్ఠతను, ఆయన ఔన్నత్యాన్ని గొప్పగా ప్రస్తావించారు. ప్రస్తావిస్తున్నారు.  అలాంటి వారిలో నీతీ ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్‌.  కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర‌గార్గ్‌ లు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని వారే. పైగా వారు చంద్రబాబును ప్రస్తుతిస్తూ, ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప.. ఎవరి ఒత్తడి, ప్రోద్బలంతో చేశారని అనుకునేందుకు అవకాశమే లేదు.    ముందుగా నీతి ఆయోగ్ మాజీ  సీఈవో అమితాబ్ కాంత్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో విశాఖ‌కు గూగుల్‌ డేటా కేంద్రం రావ‌డంపై స్పందించారు.  విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం అన్నది మామూలు వ్యక్తులు, సీఎంల వల్ల సాధ్యమయ్యే పని కాదనీ,  చంద్రబాబు వంటి విజనరీ వల్ల మాత్రమే సాధ్యమౌతుందని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి విశాఖపట్నాన్ని మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ను, ఇండియాను కూడా ప్రపంచానికి మేటిగా నిలబెడతాయని పేర్కొన్నారు.   ఇది కూడా చదవండి అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర‌గార్గ్‌ గార్గ్ కూడా చంద్రబాబు ఆంధ్రాఫస్ట్ విధానాన్ని ఒకింత క్రిటికల్ గా ప్రశంసించారు. చంద్రబాబు స్వార్థపరుడు అంటూనే.. ఆయన స్వార్థం వ్యక్తిగతమైనది కాదనీ, ఏపీని అత్యున్నతంగా నిలబట్టాలన్నదే ఆయన స్వార్థమని పేర్కొన్నారు. చంద్రబాబు   విజ‌న్‌.. ప్రణాళిక‌లు అనితర సాధ్యమంటూ ఆయన తన బయోగ్రఫిలో పేర్కొన్నారు. గ‌తం లో వాజ‌పేయిని ఒప్పించి ఉమ్మ‌డి రాష్ట్రానికి స్వ‌ర్ణ చ‌తుర్భుజి జాతీయ ర‌హ‌దారులు తెచ్చుకోవడాన్నీ, ఇప్పుడు ప్రధాని మోడీని మెప్పించి.. పలు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలా చేసుకుంటున్నారనీ వివరించారు.  నిజమే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాలు కాదు.. ఆంధ్రఫస్ట్ అన్నదే నినాదం. అందుకే చంద్రబాబు   అవకాశం వచ్చిన ఏ సందర్భంలోనూ ఆయన  స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాకులాడలేదు.  రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మాత్రమే పాటుపడుతున్నారు. అవకాసం ఉన్న అన్ని విధాలుగానూ కేంద్ర నిధుల కోసం  వెంట పడుతున్నారు.   కేంద్రం ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రానికి  ప్రాజెక్టుల్ని ప్రటికటించేలా తన పరపతిని ఉపయోగిస్తున్నారు. 

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం : టీపీసీసీ చీఫ్

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధిక మెజార్టీతో గెలవడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.  అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వర్తించాల్సిన అవసరాన్ని ఆయన హితవు పలికారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా నేతలతో చర్చించి, ప్రచార వ్యూహంపై మార్గదర్శకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించేలా అందరూ కృషి చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వివిధ డివిజన్‌లకు బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొన్నారు.

కొడాలి నాని కొత్త లుక్.. ఇలా అయిపోయారేంటి?

మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సోమవారం (అక్టోబర్ 27) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఇద్దరు మాజీలూ తిరుమలలో కలిసి తిరగడం కనిపించింది. అయితే ఈ ఇద్దరిలో కొడాలి నాని మాత్రం పూర్తి కొత్త లుక్ లో కనిపించారు. సన్నగా, పీలగా పూర్తిగా గుండుతో  ఆయన గుర్తుప ట్టలేనంతగా మారిపోయారు. కొడాలి నాని ఇటీవలే అనారోగ్యం నుంచి కోలకుున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన బయట కనిపించడం  అన్నది చాలా చాలా అరుదుగా జరుగుతోంది. ఇటీవలే జగన్ తన లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా ఒక సారి కనిపించారు. వైసీపీ నాయకులతో కలిసి విమానాశ్రయంలో  జగన్ కు స్వాగతం పలికారు. ఆ తరువాత కొడాలి నాని బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి.   

కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపేనా?

కల్వకుంట్ల కవిత జనం బాట పాదయాత్రను శనివారం (అక్టోబర్ 25) నిజమాబాద్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలలో పర్యటించనున్నారు. సరిగ్గా ఐదేళ్ల కిందట తాను ఎక్కడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారో సరిగ్గా అదే నియోజకవర్గం నుంచి ఆమె తన కొత్త రాజకీయ బాట పట్టారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగంలో.. సొంత పార్టీయే తనను దగా చేసిందని చెప్పుకొచ్చారు.  బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా తనకు వ్యతిరేకంగా చేసిన కుట్రవల్లనే తాను నిజామాబాద్ లో పరాజయం పాలయ్యానన్నారు. జనం కాదు.. తనను సొంత పార్టీయే ఓడించిందని చెప్పుకున్నారు.   తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల తనకు అపార గౌరవం ఉందని చెప్పిన కవిత.. ఆ కారణంగానే పార్టీలో తనకు ఎన్ని అవమానాలు జరిగినా నిశ్శబ్దంగా ఉన్నాననీ, అయితే ఇప్పుడు.. తనను పార్టీ నుంచి బయటకు పంపేశారనీ, అందుకే తిరిగి తన ప్రజల వద్దకు వచ్చానన్నారు.   ఈ సందర్భంగా కవిత తన ప్రసంగంలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పటికీ ప్రధానంగా ఆమె ప్రసంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులే లక్ష్యంగా సాగింది. వారిరువురూ అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ సందర్భంగా వారి అవినీతిని ప్రశ్నించిన కారణంగానే తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకున్నారు. చర్విత చరణమే అయినా కవిత.. తాను తెలంగాణ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాను కోత్త రాజకీయపార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. తాను స్వతంత్రంగా, స్వంతంగా రాజకీయాలలో రాణించాలని భావిస్తున్నట్లు చెప్పిన కవిత, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  అయితే ఒకే  సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పిస్తూ ఆమె ఎవరిని బెదరించాలని చూస్తున్నారో అవగతం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు.కవిత తెలంగాణ రాజకీయాలలో బలీయమైన శక్తిగా ఎదుగుతారా? లేదా వేచి చూడాల్సిందేనంటున్నారు.  

దేవుడితోనూ రాజకీయాలు.. జోగి రమేష్ ఒట్లను ఎవరైనా నమ్ముతారా?

వైసీపీ నేతలు రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గగుడికి వెళ్లి ప్రమాణం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా, ఇంకా చెప్పాలంటే.. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్.. నకిలీ మద్యం కేసులో తాను నిర్దోషిననీ, తనకేమీ తెలియదనీ బుకాయిస్గున్నారు. అసలు ఈ కేసులో  ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియనే తెలియదనీ గట్టిగా చెబుతున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే.. అద్దేపల్లిజనార్దన్ రావుతో జోగి రమేష్ సంబంధాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావుతో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జోగి రమేష్ తన బుకాయింపులను కొనసాగిస్తున్నారు.  నకిలీ మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరూ అడగకుండానే.. బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి మరీ ప్రమాణం చేశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు సవాల్ చేసినప్పటికీ వాళ్లు స్పందించపోవడంతో తాను వచ్చి ప్రమాణం చేశానని చెబుతున్నారు. ఈ నకిలీ మద్యం కుంభకోణం విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే దుర్గమ్మ కాళ్ల వద్దే ఉరేసుకుంటానని ఈ సందర్భంగా జోగి రమేష్ అన్నారు.  అయితే ఇక్కడ ఆయన ప్రమాణాలు, ప్రతిజ్ణలను జనం నమ్మే పరిస్థితి ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్ధనరావు పోలీసు కస్టడీలో విషయం మొత్తం పూసగుచ్చినట్లు వివరించారు. ఇందులో సందేహాలకు అతీతంగా జోగి రమేష్ ప్రమేయాన్ని అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించేశారు. ఈ నేపథ్యంలోనే జోగు రమేష్ దేవుడి మీద ప్రమాణాలంటూ హడావుడి చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైసీపీ అధికారంలో  ఉన్న సమయం నుంచీ జోగి రమేష్ నేతృత్వంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్ల అద్దేపల్లి చెబుతున్నారు. అప్పటి లెక్కలు బయటపెట్టడమే కాకుండా.. తాజా నకిలీ మద్యం కుంభకోణం వ్యవహారంలో జోగురమేష్ తో తాను చేసిన చాట్ల స్క్రీన్ షాట్లను కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ బుకాయింపులను, ప్రమాణాలను, ప్రతిజ్ణలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.  

గుర్తులపై అభ్యంతరాలు..ఓటమి అంగీకారమేనా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే 11 ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక బరిలో ఎంత మంది నుంచున్నా.. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉందన్నది నిర్వివాదాంశం. మూడు పార్టీలకూ కూడా ఈ ఉపఎన్నికలో విజయం చావో రేవో అన్నట్లుగానే పరిణమించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికలో విజయం తమ పాలనకు లిట్మస్ టెస్టుగా భావిస్తుంటే.. ఉనికి, సత్తా చాటుకోవడానికి ఈ ఉప ఎన్నిలో గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్న బీజేపీకి.. జూబ్లీ ఉప ఎన్నికలో గెలుపు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీ ఉప ఎన్నికలో విజయం కోసం మూడు పార్టీలూ కూడా సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తమను గెలుపు బాటలో నడిపిస్తాయని కాంగ్రెస్ విశ్వసిస్తుంటే.. బీఆర్ఎస్ పూర్తిగా సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ఇక బీజేపీ అయితే మోడీ కరిష్మాపై ఆధారపడి బరిలోకి దిగింది. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే ఈ ప్రచారంలో బీఆర్ఎస్ అధికార పార్టీపై విమర్శల దూకుడు పెంచింది. అదే సమయంలో ఎన్నికల గుర్తుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. అదే ఆ పార్టీని ఓటమి భయం వెంటాడుతోందా అన్న అనుమానాలు కలిగేలా చేస్తోందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ బీఆర్ఎస్ ఎన్నికల గుర్తులపై చేస్తున్న అభ్యంతరాలేమిటయ్యా అంటే..  స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన చపాతీ రోలర్, సబ్బు డిష్, కెమెరా, రోడ్ రోలర్, షిప్ వంటి వి బీఆర్ఎస్ ఎన్నికల చిహ్నమైన కారును పోలి ఉన్నాయని చెబుతోంది. దీని వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాదిస్తోంది. ఆ అయోమయం కారణంగా ఓటర్లు కారు  గుర్తుకు వేయాల్సిన ఓటును పైన చెప్పిన వాటిలో దేనికో ఒక దానికి వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇదే ఆ పార్టీలో ఓటమి భయాన్ని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఈవీఎంలో గుర్తుతో పాటు అభ్యర్థి పేరు, ఫొటో కూడా ఉంటాయి కనుక అయోమయానికి ఎక్కడ అవకాశం ఉందని కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి. ఓటమి భయంతోనే గుర్తుల అయోమయం అంటూ బీఆర్ఎస్ అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదని ఎద్దేవా చేస్తున్నాయి.  పోలింగ్ కు ముందే ఓటమికి సాకులు వెతుకుతున్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని అంటున్నాయి. 

జలవివాదాలతో ప్రభుత్వాల రాజకీయం.. ఏబీవీ

నీటి వివాదాలను ప్రభుత్వాలే రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు.   రాయలసీమ ప్రాంతంలోని నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా ఆదివారం (అక్టోబర్ 26)    కడప ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.   కడప ,చిత్తూరు జిల్లాల జీవనాడి అయిన గాలేరు నగరి సుజల స్రవంతి నిధుల కొరత,  అటవీ అనుమతుల మంజూరులో జాప్యం వల్ల నాలుగు దశాబ్దాలుగా నత్తనడక నడుస్తోందని విమర్శించారు.  హంద్రీనీవా రెండో దశ అనుసంధానం పేరుతో కండలేరు -కరకంపాడి ఎత్తిపోతల పథకం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గాలేరు నగరి సుజల స్రవంతి 100శాతం  గ్రావిటీ కలిగిన ప్రాజెక్టన్నారు.  గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, రాజోలి ప్రాజెక్టుల పూర్తికి, పంట కాలువల నిర్మాణానికి నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న  ప్రభుత్వం పోలవరం బనకచర్ల ఎత్తిపోతల పథకం పేరుతో 85 వేల కోట్ల రూపాయలు కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఈ ప్రాజెక్టు  రాష్ట్ర ప్రజల పై అదనపు భారాన్ని మోపడానికి తప్ప మరెందుకూ పనికిరాదన్నారు.   గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పేరుతో రాయలసీమ ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాల వివాదాలకు ఆజ్యం పోయడమేనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో ఈపీసీ విధానం అమలు చేసేవారని కానీ ప్రస్తుతం పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు నిర్మాణం, అనుమతులు కూడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం అంటే ప్రాజెక్టు మొత్తం ప్రైవేటుపరం చేసి దోపిడీకి ద్వారాలు తరచడమేనని విమర్శించారు.  

క‌విత‌క్క లుక్కు మారింది కానీ!

  క‌విత‌క్క కారు క‌హానీలు.. ఇప్ప‌ట్లో ఆగేలా లేవు. మొత్తం త‌న లుక్కు మార్చిన క‌విత‌క్క‌.. ప్ర‌స్తుతం ప్ర‌తిఘ‌ట‌న‌లో విజ‌య‌శాంతిలా క‌నిపిస్తున్నార‌న్న‌ మాటేగానీ.. ఆమె త‌న పుట్టింటి మీద పుట్టింటిలాంటి బీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెర‌గ‌టం మాత్రం త‌గ్గించ‌డం లేదు. సొంత పార్టీ వారే త‌న‌ను నిజామాబాద్ లో ఓడించార‌ని అంటున్నారు క‌విత‌. ప్ర‌స్తుతం జాగృతి జ‌నం బాట ప‌ట్టిన ఆమె 33 జిల్లాల తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌నున్నాన‌నీ.. ఆనాడు ప్రాణాలు బ‌లి ఇచ్చి తెలంగాణ రావ‌డానికి కార‌ణ‌మైన‌ అమ‌ర వీరుల కుటుంబాల‌కు కోటి రూపాయ‌లు ద‌క్కే వ‌ర‌కూ త‌న పోరాటం ఆప‌న‌ని అన్నారు. త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చే వారు ఈ యాత్ర‌లో వ‌చ్చి క‌ల‌వ‌వ‌చ్చ‌ని.. ఆహ్వానం ప‌లికారు క‌విత‌. త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ రావ‌ల్సిన గుర్తింపు అయితే రాలేద‌నీ.. పార్టీలో త‌న‌ను తొక్కేశార‌న్న‌ట్టుగా మాట్లాడిన క‌విత‌.. టార్గెట్ ఎవ‌రు??? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బేసిగ్గా ఆమె బీఆర్ఎస్ బై ప్రాడ‌క్ట్. అలాంటి ఆమెకు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ప్ర‌త్య‌ర్ధులుగా ఉండాలి. కానీ చిత్ర‌మేంటంటే ఆమె నోరు తెరిస్తే యాంటీ బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తున్నారు. దానికి తోడు త‌న తండ్రిని ఇన్నాళ్ల పాటు వెన‌కేసుకొచ్చిన ఆమె తాజాగా త‌న తండ్రి ఫోటో లేకుండానే ఈ యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం పోరాటం రాజ‌కీయ‌మైన‌దా? లేక వ్య‌క్తిగ‌త‌మైన‌దా? అన్న అనుమానాల‌కు తావిస్తున్నారు క‌విత‌. ఎందుకంటే ఒక స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ విధానంతో జ‌నం కోసం- జ‌నం బాట ప‌ట్టాన‌ని క్లారిటీ ఇవ్వ‌కుండా పొద్ద‌స్త‌మానం పుట్టింటిని త‌న ఇంటి వారిని ప‌దే ప‌దే తిట్ట‌డం వ‌ల్ల అది ఆమె సొంత విష‌యం అవుతుంది కానీ ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జా పోరాటంగా క‌నిపించ‌దు క‌దా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.