జగన్ ఢమాల్.. చంద్రబాబు కమాల్.. అధికార మార్పు ఖాయమేనా?
posted on Aug 20, 2021 @ 3:39PM
71 ఏళ్ల నవయువకుడు చంద్రబాబు. 48 ఏళ్ల అనుభవరాహిత్యుడు జగన్. రాష్ట్ర విభజన తర్వాత మీరే కావాలంటూ చంద్రబాబును నవ్యాంధ్ర ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రులు. ఒక్క ఛాన్స్ అంటూ అందరినీ నమ్మించి అందలమెక్కారు జగన్. అమరావతి స్వప్నం కాంక్షించారు చంద్రబాబు. అద్భుతమైన కలల రాజధాన్ని నిర్మించ తలపెట్టారు. కుర్చీ ఎక్కగానే మాట తప్పి, మడమ తిప్పి అమరావతిని చిదిమేస్తున్నారు జగన్. రాజధానితో మూడు ముక్కలాట ఆడుతున్నారు. పెట్టుబడుల వరద పారించి ఏపీని సన్‌రైజ్ స్టేట్‌గా నిలిపారు చంద్రబాబు. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయేలా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చేశారు జగన్. ఉద్యోగులకు జీతాలూ సమయానికి రాని దుస్థితి. చంద్రబాబు హయాంలో శాంతి.. సౌరభం. జగన్ పాలనలో అక్రమాలు, అరాచకాలు. కేసులు, అరెస్టులు. ఆలయాలు, దళితులపై దాడులు. మతమార్పిడిలు, మహిళలపై ఆగడాలు.
ఎంత తేడా.. ఎంత తేడా.. రెండేళ్లలో ఎంత తేడా. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది? జగన్ పాలనలో ఇప్పుడెలా ఉంది? అన్ని రకాల ఎలక్షన్స్‌లో గెలుస్తున్నాంగా.. మాకిక తిరుగులేదని విర్రవీగుతున్న వైసీపీకి ఇండియా టుడే- మూడ్ ఆఫ్‌ది నేషన్ సర్వే దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో జగన్‌రెడ్డిలో కలవరింత. అదే సమయంలో చంద్రబాబులో పులకరింత. పాలకపక్షంలో తీవ్ర నిరుత్సాహం.. ప్రతిపక్షంలో రెట్టించిన ఉత్సాహం. ఇదే ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం. డౌట్ ఉంటే టీడీపీ వాళ్ల సోషల్ మీడియా సైట్లు చెక్ చేసుకోండి.. జోష్ మామూలుగా లేదక్కడ...
ప్రజల్లో సీఎం జగన్‌రెడ్డి పరపతి దారుణంగా పడిపోయింది. ఇండియా టుడే సర్వేలో కేవలం 6 శాతం మంది మాత్రమే జగన్ బెస్ట్ సీఎం అంటున్నారంటే అర్థం ఏంటి? మిగతా 94 శాతం జగన్‌ను అసహ్యించుకుంటున్నట్టేగా? జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టేగా? ప్రజల్లో తనపై ఇంతటి వ్యతిరేకతను జగన్ సైతం ఊహించి ఉండకపోవచ్చు. జగన్‌పై దండుకట్టి దండయాత్ర చేయడానికి ఇదే మంచి సమయం అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు-లోకేశ్ నాయకత్వంలో టీడీపీ ఇదే జోరుతో పోరాడితే.. వచ్చే ఎన్నికల్లో జగన్ పాలనకు మంగళం పాడటం తప్పదంటున్నారు.
రెండేళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రజాపక్షాన పోరాడుతోంది టీడీపీ. 71 ఏళ్ల చంద్రబాబు అసెంబ్లీలో, జూమ్ మీటింగ్స్‌లో జగన్ సర్కారును ప్రజల ముందు దోషిగా నిలబెడుతుంటే.. 38 ఏళ్ల నారా లోకేశ్ దూకుడు మంత్రంతో జగన్‌పై దండయాత్ర చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ఆ ఉత్సాహం సుస్పష్టంగా కనిపించింది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నారా లోకేశ్ నేనున్నానంటూ ప్రత్యక్షమవుతున్నారు. ప్రజలకు మద్దతుగా నిలుస్తుండటం పాలకపక్షానికి బీపీ పెంచుతోంది. అందుకే, లోకేశ్‌పైనా కేసు పెట్టి, అరెస్టు చేసి కక్ష్య తీర్చుకుంది ప్రభుత్వం.
ఇండియా టుడే సర్వే తర్వాత మరింత ఉధృత కార్యచరణకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు-లోకేశ్‌లు. భావస్వారూప్య వర్గాలను కూడగట్టి జగన్‌ను ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల టీడీపీ-బీజేపీ-జనసేనలు పరస్పరం కాస్త సానుకూల వైఖరితో ఉంటూ జగన్ సర్కారుపై అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ సీఎం జగన్‌రెడ్డిపై లోకేశ్‌ను ఆయుధంగా ప్రయోగించి సక్సెస్ అయిన చంద్రబాబు.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తర్వాత ఇక తనే స్వయంగా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. కరోనా మూడోదశ తర్వాత.. అవసరమైతే జిల్లా పర్యటనలు చేయాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారట. జగన్‌పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం.. రాష్ట్రం తిరోగమనంలో పోతుండటం.. అదే సమయంలో చంద్రబాబు మంచి పరిపాలనాదక్షులనే అభిమానం ఉండటం.. చంద్రబాబు అయితే ఏపీ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం ప్రజల్లో ఉండటం.. ఇలా అనేక అంశాలు చంద్రబాబుకు-టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని.. పునర్‌వైభవానికి ఇదే మంచి సమయమనేది రాజకీయ విశ్లేషకుల మాట.