ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్
posted on Jun 1, 2024 @ 7:09PM
ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల్లోనూ టీడీపీ కూటమి ముందంజలో వుంది. పీపుల్స్ పల్స్ సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15 స్థానాలు, వైసీపీకి 3 నుంచి 5 స్థానాలు, జనసేనకు 2 స్థానాలు వస్తాయని తేల్చింది.
అలాగే కేకే సర్వేస్ సంస్థ తెలుగుదేశం పార్టీకి 17 స్థానాలు వైసీపీకి సున్నా స్థానాలు, జనసేనకు 2 స్థానాలు, బీజేపీకి 6 స్థానాలు వస్తాయని చెప్పింది.
ఇండియా టీవీ తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15 స్థానాలు, వైసీపీకి 3 నుంచి 5 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని తెలిపింది.
రైజ్ సంస్థ తెలుగుదేశం పార్టీ కూటమికి 17 నుంచి 20 స్థానాలు, వైసీపీకి 7 నుంచి 10 స్థానాలు వస్తాయని ప్రకటించింది.