విశాఖకు సచివాలయం తరలింపు.. ముహూర్తం ఖరారు!!
posted on Jan 6, 2020 @ 5:46PM
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తోన్న వైఎస్ జగన్ సర్కార్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖకు సచివాలయం తరలింపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీ నుంచి విశాఖలో తాత్కాలిక సచివాలయ కార్యకలాపాలు ప్రారంభించాలన్న యోచనలో వైసీపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి విశాఖలోని మిలినీయం టవర్స్‌లో కొత్త సచివాలయం ప్రారంభం కానుందని సమాచారం. విడతలవారీగా సచివాలయం తరలింపునకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రాధాన్యత కలిగిన శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలించేందుకు సిద్దమయ్యారట. మొత్తంగా 34 శాఖల నుంచి కీలక విభాగాల తరలించనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ నెల 20, 21 వ తేదీలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది రిప్లబిక్ డే పరేడ్ కూడా విశాఖలో నిర్వహించే యోచనలో జగన్ సర్కార్ ఉందని సమాచారం.