ఏపీ కొత్త సీఎస్ ఎంపికలో ట్విస్టులే ట్విస్టులు
posted on Jun 26, 2021 @ 5:47PM
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం జూన్ 30 న ముగుస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో ఆరు నెలలు ఆయననే కొనసాగించాలని భావించారు. అందు కోసంగా ప్రదాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో చర్చలు జరిపారు. ఓకే అని పించుకున్నారు. అయితే ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా కొనసాగడం ఇష్టం లేని ఒక కీలక అధికారి అడ్డుపుల్ల వేశారు. కేంద్రానికి లేఖను తొక్కిపట్టి, సాంకేతికంగా సమస్యలు సృష్టించారు. ఆదిత్యనాథ్ పదవీ కాలం పొడిగింపును దిగ్విజయంగా అడ్డుకున్నారని ఆయన స్థానంలో నీరబ్‌కుమార్ ప్రసాద్ సీఎస్’గా రావచ్చని వార్తలొచ్చాయి.అయితే ఢిల్లీలోని మరో పెద్ద తలకాయ చొరవతో దాస్‌కు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.
అదలా, ఉంటే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరంలో, ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. కొనేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు తిరిగి వస్తున్నారు. ప్రస్తుతం శర్మ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. అయితే, ఎందుకనో, ఆయన రాష్ట్ర సర్వీస్’కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే కేంద్రంలోకీలకమైన పదవిలో ఉన్న ఆయన ఉన్నపళంగా
రాష్ట్ర కేడర్‌కు రావడం అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 1985 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మను తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్(1987 బ్యాచ్) సమీర్ శర్మ కంటే రెండేళ్లు జూనియర్. మరోవైపు ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకే సమీర్ శర్మను రాష్ట్రానికి పంపుతున్నట్లు కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులలో పేర్కొందని సమాచారం. పొడిగింపు తర్వాత ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబరు నాటికి పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత ఆయనకు సీఎస్ గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత మాములుగా అయితే ఎక్కువ కాలం సీఎస్’గా కొనసాగే అవకాశం లేదని అంటున్నారు. ఆ మాత్రం దానికే సమీర్ శర్మ కేంద్రంలో పెద్ద పోస్టు వదులుకుని ఎందుకు వస్తున్నారో తెలియడం లేదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఆయన్న ప్రస్తుతానికి బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్‌గా నియమించి.. మూడు నెలల తర్వాత సీఎస్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన రిటైర్‌మెంట్ తర్వాత మళ్లీ కేంద్రానికి రాసి కొనసాగింపు ఇప్పించే అవకాశం ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.