ఏపీ ముఖ్యమంత్రి మహిళ! అయ్యయ్యో జగనయ్య..
posted on Jun 29, 2021 @ 12:39PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహిళా.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా.. జగన్ రెడ్డి ఉండగా మహిళ ఎప్పుడు ముఖ్యమంత్రి అయిందని షాకవుతున్నారా.. ఏమో.. ఎందుకంటే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. సాక్ష్యాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డీనే. బహిరంగ వేదికగానే ఆయన ఈ విషయం చెప్పారు. ఏపీకి మహిళ ముఖ్యమంత్రిగా ఉందని గొప్పగా తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి చేసిన మహిళా ముఖ్యమంత్రి వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీలో వైరల్ గా మారాయి. జనాల్లో చర్చగా మారింది. విజయవాడలోని గొల్లపూడిలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు తీసుకువచ్చిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా మహిళే ఉన్నారని కామెంట్ చేశారు. సీఎం మాటలు విన్నవారంతా షాకయ్యారు. దీంతో తప్పు చెప్పానని గ్రహించిన సీఎం జగన్.. వెంటనే సర్దుకుని హోంశాఖ మంత్రిగా మహిళా ఉన్నారంటూ సరి చేసుకున్నారు.
ఇప్పటికే వైఎస్ జగన్.. ప్రతిరోజూ రాత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడతారంటూ.. ఈ విషయం సీఎం జగనే స్వయంగా చెప్పినట్టు.. నమ్మదగ్గ సమాచారం ప్రచారంలో ఉంది. కేవలం వైఎస్సార్‌తోనే కాదు.. దేవుడి బిడ్డ అయిన జగన్.. డైలీ తాను జీసస్‌తో మాట్లాడతానని ముఖ్యమంత్రే చెప్పినట్టు అధికార వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు విషయాల గురించి ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థ అధినేత బయట పెట్టడంతో.. ఏపీ సీఎం జగన్‌కు అసలేమైంది..? ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందనే అనుమానం, చర్చ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలో వైసీపీ ఎంపీ రఘురామ రాజు.. సీఎం జగన్ మెంటల్ కండిషన్ సరిగా లేనట్టుందనే కామెంట్ చేశారు. దీంతో జగన్ మానసిక స్థితి సరిగా లేదా అన్న అనుమానాలు జనాల్లో వ్యక్తమవుతున్నాయి.