అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
posted on Mar 14, 2013 @ 3:30PM
శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నాటికి వాయిదా పడ్డాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదేండ్ల మనోహర్ తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. మరోవైపు టీఆర్ఎస్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. తెలంగాణపై టీఆర్ఎస్, విద్యుత్ కోతలపై చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు అసెంబ్లీలో దిల్‌సుఖనగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారికి సభ్యులు సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన నివాళులర్పించారు.