మల్లారెడ్డికి మరో షాక్.. బ్రోమాసిపేట చెరువు స్థలంలో ఆక్రమణల కూల్చివేత
posted on May 24, 2024 @ 2:18PM
షామీర్ పేట మండలం బ్రోమాసిపేట చెరువు ఆక్రమణలకు గురైందని ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో రెవిన్యూ అధికారులు స్పందించారు. తరచుగా భూ వివాదాలతో వార్తల్లోకెక్కిన మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా బ్రోమాసిపేట ఫుల్ ట్యాంక్ లెవల్ లో అక్రమ నిర్మాణాలను చేపట్టారు. దీంతో అప్రమత్తమైన రెవిన్యూ అధికారులు చెరువు పక్కనే ప్రహారీ గోడను కూల్చి వేశారు. బిఆర్ఎస్ హాయంలో భూ కబ్జాలు చేసిన మేడ్చెల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రో జుల క్రితం మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకించడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. జెసీబీ సాయంతో ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు.