పూరి జగన్నాథ్ కొడుకు గొడవేంటి?
posted on Feb 16, 2015 9:01AM
సినిమావాళ్ళతో ఓ ఎస్.ఐ. ఓవర్ యాక్షన్ చేశాడు. దాంతో అనవసరమైన గొడవలో ఇరుక్కుపోయి ఇప్పుడు అల్లాడుతున్నాడు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా ‘ఆంధ్రాపోరి’ అనే సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లా పాల్వంచలో జరుగుతోంది. సినిమా యూనిట్ మెంబర్లు అందరూ భద్రాచలం రోడ్‌లోని ఒక హోటల్లో బస చేశారు. ఒకరోజు అర్ధరాత్రివేళ పాల్వంచ ఎస్.ఐ. షణ్ముఖాచారి ఈ హోటల్‌కి వచ్చాడు. అక్కడ బస చేసిన సినిమా యూనిట్ సభ్యులతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. పూరి జగన్నాథ్ కొడుకుతో కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ఖమ్మం జిల్లాకు వెళ్ళి అక్కడి ఉన్నతాధికారులకు జరిగిన ఘటన మొత్తాన్నీ పూస గుచ్చినట్టు వివరించాడు. దాంతో పోలీసు అధికారులు సదరు ఎస్.ఐ.ని జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. దాంతో ఇప్పుడు ఆ ఎస్.ఐ. షణ్ముఖాచారి లబోదిబో అంటున్నాడు.