"కళాభినేత్రి" వాణిశ్రీ కి అభినయ భారతి పురస్కారం
posted on Feb 23, 2013 @ 11:55AM
హైదరాబాద్, ప్రఖ్యాత చలనచిత్ర నటి కళాభినేత్రి శ్రీమతి వాణిశ్రీ ని "అభినయ భారతి" పురస్కారంతో సత్కరించనున్నట్లు డా. గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ మేడికొండ శ్రీనివాస్ చౌదరి. శ్రీ మానాపురం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియచేసారు. డా.గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్ 6వ అఖిల భారత స్థాయి నాటికల పోటీలు ఫిబ్రవరి 24,25,26 తేదీలలో పాలకొల్లులో జరగనున్నాయని తెలిపారు.
24వ తారీఖున శ్రీమతి వాణిశ్రీ గారికి, "అభినయ భారతి" బిరుదు ప్రధానం. యువకళావాహిని వ్యవస్థాపకులు శ్రీ Y.K. నాగేశ్వరరావు గారిని బళ్ళారి రాఘవ రంగస్థల పురస్కారం. యువ నటీమణి, కూచిపూడి నాట్య కళాకారిణి కుమారి మధుశాలిని గారిని నాట్యమయూరి పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖా మాత్యులు శ్రీ M.మహీధర్ రెడ్డి గారు, మైనర్ ఇరిగేషన్ శాఖా మాత్య్లులు శ్రీ T.G. వెంకటేష్ గారు, సాంఘీక సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు, పాలకొల్లు శాసనసభ్యురాలు శ్రీమతి బంగారు ఉషారాణి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ లగడపాటి రాజగోపాల్ గారు, ప్రఖ్యాత తెలుగు గజల్ గాయకులూ డా. గజల్ శ్రీనివాస్ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫిబ్రవరి 24,25,26 తేదీలలో ఏడు (7) నాటికలు ప్రదర్శించబడతాయని తెలిపారు.