తమిళ యువ నటి శుభ పుతెలా మృతి
posted on Oct 25, 2012 @ 11:17AM
తమిళ యువనటి శుభ పుతెలా (21) కన్నుమూసింది. శుభ పచ్చ కామెర్లు, కిడ్నీ వ్యాధి బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారు. గత మూడు నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు ఇటీవల పచ్చకామెర్ల వ్యాధి సోకిందని, ఆరోగ్యం మెరుగుపడినట్లే కనిపించిందని అనుకోకుండా కోమాలోకి జారుకున్నారని వైద్యులు వెల్లడించారు. ‘మాలై పోజుదీన్ మయాకథిలే’ చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. తెలుగు హీరో రామ్ సరసన ‘ఒంగోలు గిత్త’ చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించింది. గుంటూరులో కొన్నిరోజుల షూటింగ్ అనంతరం అనారోగ్య కారణాలతో తప్పుకుంది. 2010 లో మిస్ సౌత్ ఇండియా టైటిల్ని గెలుచుకు౦ది. ఈమె జ్యూవెలరీ, టెక్స్‌టైల్స్ తదితర వాటికి మోడల్‌గా వ్యవహరించింది.