Read more!

యువకుడి చెంప చెల్లుమనిపించిన నగ్మా

 

 

 

కాంగ్రెస్ అభ్యర్ధి, నటి నగ్మాకు తన అందం, ఇమేజ్ ప్రచారంలో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మాకు ప్రచారంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొన్న ఓ సీనియర్ కాంగ్రెస్ నేత మీద చేయి వేసి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయగా..ఈ రోజు ఆమె మీదకు ఓ కుర్రాడు వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆ కుర్రాడి చెంప చెళ్లుమనిపించింది.

 
ఆమె నియోజకవర్గంలోని జల్లికోట్‌లో జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అందులోని కొంతమంది యువకులు ఆమెతో కరచాలనానికి పోటీపడ్డారు. దీంతో యువకులకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో దగ్గరకు వచ్చిన యువకుడు మితిమీరి ప్రవర్తించాడు. నగ్మా యువకుడిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ సంధర్భంగా ప్రజలు నగ్మా వెనక్కు వెళ్లాలని నినాదాలు చేశారు. వారిని చల్లబరచడానికి నగ్మా ప్రయత్నించిన పెద్దగా ఫలితం ఇవ్వలేదు.