నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో  విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం (జులై 13) తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. నాలుగు దశాబ్దాలుగా వందలాది సినిమాలలో నటించి, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపు 750కి పైగా చిత్రాలలో నటించిన కోట శ్రీనివాసరావు.. ఇటీవలి కాలంలో ఆయన సినిమాలలో నటించడం మానేసి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమేడియన్ ఇలా విభిన్నపాత్రలలో తనదైన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సులలో కోట శ్రీనివాసరావు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.  తెలుగుతో పాటు  మలయాళం, కన్నడ, హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించారు.   1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి విచ్చిన కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక ఆయనకు తొమ్మిది సార్లు నంది పురస్కారాలు నమించాయి. కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.  

Teluguone gnews banner