ఇంధ‌న స్విచ్ ఆఫ్ చేసి టేకాఫ్ చేసే పైలెట్ ఎక్క‌డైనా ఉంటారా?

ఫ్ల‌యిట్ యాక్సిడెంట్ జ‌రిగిన రెండు మూడు రోజుల త‌ర్వాత వెలుగు చూసిన కోణాల్లో ఇదీ ఒక‌టి. అదేంటంటే.. ఇంధ‌న స్విచ్ ని ఆన్ చేయ‌కుండానే అహ్మ‌దాబాద్ టు లండ‌న్ ప్లయిట్ టేకాఫ్ అయ్యింది.  ఆ మాట‌కొస్తే ఫ్యూయ‌ల్ పాస్ కాకుండా ఫ్ల‌యిట్ ఎలా టేకాఫ్ అయ్యిందని కొంద‌రు అడిగిన ప్ర‌శ్న‌కు వీరు చెప్పిన స‌మాధానం ఏంటంటే..  పైపుల్లో మిగులు గా ఉన్న ఇంధ‌నంతో ఫ్ల‌యిట్ పైకి లేచింద‌నీ.. ఇంత‌లో ఫ్యూయ‌ల్ అంద‌క పోవ‌డం వ‌ల్లే.. ఫ్ల‌యిట్ టేకాఫ్ అయిన 32 సెక‌న్ల‌కే క్రాష్ ల్యాండ్ అయ్యింద‌ని చెప్పుకొచ్చారు. టేకాఫ్ టైంలో స్విచ్చుల‌తో ఆడుకునేంత‌ తెలివి త‌క్కువ పైలెట్ ఎక్క‌డా ఉండ‌డు. ఇదీ ఎయిర్ ఇండియా ఏఐ 171 క్రాష్ పై .. విడుద‌లైన  ఏఏఐబి ప్రాథమిక నివేదికపై   ఏవియేషన్ నిపుణుడు మార్క్ మార్టిన్ స్పందన. రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆపేశార‌ని, దీనివల్ల టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లు ఆగిపోయాయని అంటోంది ఏఏఐబి రిపోర్ట్.  ఒక వేళ అదే నిజ‌మైతే.. 787 బోయింగ్ ఆప‌రేట‌ర్ల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా దీని ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటారు మార్టిన్.

 దానికి తోడు.. కేంద్ర విమానయాన మంత్రి కూడా ఇదే ఫైన‌ల్ రిపోర్ట్ కాద‌ని అన్నారు. దీన్నిబ‌ట్టీ చూస్తే ఫ్యూయ‌ల్ స్విచ్ మాత్ర‌మే ఈ ప్ర‌మాదంలో కీల‌కం కాద‌న్న‌ది తెలుస్తూనే ఉంది. ఇక మార్టిన్ చెబుతున్నట్టు అలా జ‌రిగే అవ‌కాశ‌ముందా? అన్న‌ది కూడా అత్యంత ముఖ్య‌మైన విష‌య‌మే. ఎందుకంటే ఒక ఫ్లైట్ పైల‌ట్ సీట్ లో కూర్చున్నాక‌.. అన్ని స్విచ్ ల‌ను చెక్ చేసుకోవ‌డం ఒక అల‌వాటుగా మార్చుకుంటారు. అంతే కాదు.. ఇక్క‌డ ఒక‌రికి ఇద్ద‌రున్న‌పుడు.. అది మ‌రింత ఎక్కువ జాగరూక‌త‌తో సాగుతుంది.

  ఫ్ల‌యిట్ ఇంధ‌న స్విచ్ ని ఆపుకుని ఒక ఫ్ల‌యిట్ టేకాఫ్ అయ్యిందంటే అది ప్ర‌పంచ ఏవియేష‌న్ చ‌రిత్ర‌లోనే ఒక చీక‌టి రోజు. ఎందుకంటే విమానం న‌డిచేదే ఇంధ‌నం మీద‌. అలాంటి ఇంధ‌నం స్విచ్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా? చూసుకోకుండా ఒక‌రికి ఇద్ద‌రు పైలెట్లు టేకాఫ్ చేశారంటే.. అది ఫ్ల‌యిట్ మేనేజ్మెంట్ కే కాదు పైలెట్ మేనేజ్మెంట్ కి కూడా అవ‌మాన‌క‌ర‌మే. 

మాములుగా మ‌నం చిన్న కారు తోలితేనే.. అది ఫ్యూయ‌ల్ మార్క్ ద‌గ్గ‌ర ప‌దే ప‌దే చూపిస్తుంది. అలాంటిది ఒక ఫ్ల‌యిట్ ఇంకెంత ఇండికేట్ చేసి ఉండాలి. అది కూడా అల్ట్రా మోడ్ర‌న్ అయిన బోయింగ్ ఫ్ల‌యిట్ ఎంత‌గా  హెచ్చ‌రిస్తుంది? అన్న దగ్గ‌రే అంద‌రి ఆలోచ‌న‌లు ఆగిపోతున్నాయ్. మ‌రి చూడాలి కాక్ పిట్ లో ఆ ఇద్ద‌రు పైలెట్లు ఇంధ‌న స్విచ్ సంభాష‌ణే ఫైన‌ల్ అవుతుందా? లేక మ‌రేదైనా విష‌యం బ‌య‌ట ప‌డుతుందా తేలాల్సి ఉంది.

Teluguone gnews banner