రాష్ట్రపతి, ప్రధానికి రక్తంతో లేఖ రాసిన యువకుడు..
posted on Jul 24, 2021 @ 1:39PM
ఈ మధ్య కాలంలో అందరూ ఏదో ఒక రకంగా గుర్తింపు పొందాలని ఆలోచిస్తున్నారు.. అందుకు వినూతనమైన పనులు చేస్తున్నారు..అందులో కూడా కొంత మంది సమాజ శ్రేయస్సు కోసం కంకణం కట్టుకుంటున్నారు. కరోనా టైం లో అందరికి అడ్డగానిలిచిన సోను సూద్ ను కావడానికి ఒక యువకుడు హైదరాబాద్ నుండి ముంబై వరకు పాదయాత్ర చేశాడు. ఆ విషయం అందరికి తెలిసిందే.. తాజాగా కర్ణాటకు చెందిన ఓ యువకుడు.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తదితరులకు తన రక్తంతో లేఖ రాశాడు. ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ లేఖ లో ఏం రాశాడు అని తెలుసుకోవాలంటే మీరు ఈ వార్త చదవాలి మరి. ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకు..
కర్ణాటకకు చెందిన ఓ యువకుడు.. అతని పేరు రోషన్..దేశ వ్యాప్తంగా గో సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరాడు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరాడు. కర్ణాటక గో వధ నిషేధ చట్టాలు పగడ్భందీగా అమలయ్యేలా చూడాలని, దేశంలో గో వధ నిషేధ చట్టాలున్నా… విచ్చలవిడిగా గో మాంసం విక్రయిస్తున్నారని తన లేఖలో వారి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది అయినా గో వధ కొనసాగుతుండటంతో మనోవేధనతో ఇప్పుడు వారికి తన రక్తంతో లేఖలు రాసినట్లు చెప్పాడు. గత ఐదారు సంవత్సరాలుగా రాష్ట్రపతి, ప్రధానికి ఈ విషయమై లేఖలు రాసినట్లు తెలిపాడు.
ఆవులను తాము దేవుడితో సమానంగా భావిస్తామని పేర్కొన్న రోషన్..అది హిందువుల సంస్కృతిలో భాగమయ్యిందన్నారు. ఆవులతో ప్రతి హిందువుకు ప్రత్యేక అనుబంధం ఉందని..మాంసం కోసం గోవులను వధించడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు రోషన్ తెలిపాడు. దేశ వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణా, వధ కొనసాగుతోందని..దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా రక్తంతో రాసిన లేఖను పంపారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేందుకు చొరవ చూపాలని కోరాడు.
ఇక ఈ రోషన్ ఎవరు.. అంటే కర్ణాటకలో జరుగుతున్న గో సంరక్షణ ఉద్యమంలో రోషన్ చురుగ్గా పాల్గొంటున్నాడు. తమ ప్రాంతంలో పశువులను అక్రమంగా గోశాలకు తరలిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణం స్పందించి గో సమితి సభ్యులతో కలిసి అక్కడ వాలిపోతాడు. మూగజీవాలకు విముక్తి కల్పించి గో సంరక్షణ కేంద్రానికి తరలిస్తాడు. గోవుల సంరక్షణ కోసం పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇలా సంఘంలో జరిగే అవాంఛనీయ సంఘటనలు అడ్డుకట్ట వేయడానికి నిత్యం ప్రయత్నిస్తాడు రోషన్.. చట్టవిరుద్ధంగా సాగుతున్న గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు సరైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రోషన్ ఒక వైపు ఆవేదన వ్యక్తం చేస్తూనే మరో వైపు ప్రశ్నిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులతో రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేయాలని మూగజీవుల ప్రేమికుడు రోషన్ డిమాండ్ చేశారు. గో సంరక్షణ కోసం రోషన్ రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు తన రక్తంతో లేఖలు రాయడం ఆ రాష్ట్ర మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.