మొగుడిని లూటీ.. ప్రియుడికి నాటి..
posted on May 25, 2021 8:40AM
ఓపెన్ చేస్తే.. అది ఖమ్మం జిల్లా. కారేపల్లి గ్రామం. ఆ గ్రామానికి చెందిన శివ ప్రకాష్ . బంగారు తాకట్టు పెట్టుకునే వ్యాపారం చేసేవాడు. అతనికి పెళ్లి అయింది. తన భార్య పేరు అర్చన. వీరికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. సంతానం కలిగాక కొంత కాలానికి భార్య, భర్తల మధ్య వివాదాలు వచ్చాయి.
కట్ చేస్తే.. ఈ క్రమంలోనే ఏడాది నుంచి వేరు వేరుగా ఉంటున్నారు. ముగ్గురు పిల్లలను తన వెంటే ఉంచుకున్న అర్చన గుంటూరులోని తన పుట్టినింట్లో ఉంటుంది. ఇదే సమయంలో మాచెర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన బతుల వెంకట కృష్ణ ప్రసాద్(27)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ప్రియుడితోనే జీవించాలని నిర్ణయించుకుంది అర్చన. సరిగ్గా ఇదే సమయంలో శివప్రకాశ్ తల్లి మరణించడంతో అంత్యక్రియలకు హాజరైంది.. ఆ తర్వాత భర్త ఇంట్లోనే ఉంది..భర్త కూడా పోనిలే అనుకున్నారు. పిల్లల భవిష్యత్తు ఆలోచించాడు.
అంత బాగానే ఉందనుకునే సమయంలో శివ ప్రకాష్ ఇంట్లో 4న గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి.. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్ దొంగతనానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి మే 5న ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత మే 20న మరోసారి వచ్చిన బాధితుడు మొత్తం 1,330 గ్రాముల బంగారం, 2,330 గ్రాములు వెండి దొంగిలించారని అసలు విషయం చెప్పడంతో పోలీసులు విచారణ వేగవంతం చేసి చివరకు అసలు దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి మొత్తం రూ. 63 లక్షలు విలువ చేసే 1224.890 గ్రాముల బంగారం, 2,340 వెండి, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న వస్తువులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఇంతకీ ఆ దొంగ లేడీనా..? కిలాడీ నా..?
ఆ బంగారం పోయిన ముందు రోజు రాత్రి బతుల వెంకట కృష్ణ ప్రసాద్ ఇతను ఎవరో గుర్తున్నాడా.. అదే ఈ కథలో హీరోయిన్ లవర్. అదేనండి సెటప్.. ముందస్తు ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసేందుకు ప్రియుడి సహకారం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మే 3వ తేదిన ప్రియుడిని కారేపల్లికి పిలిపించింది. ఆ రోజు రాత్రి ప్రియుడు కారేపల్లి రైల్వే స్టేషన్‌లోనే బసచేశాడు. ఆ తర్వాత మే 4న భర్త జేబులో నుంచి లాకర్ తాళాలు తీసుకొని బంగారం, వెండి, ల్యాప్‌టాప్‌ను దొంగిలించి.. ఆ మొత్తాన్ని కృష్ణ ప్రసాద్‌కు అప్పగించింది. వాటిని అమ్మి నగదు సిద్ధం చేయామని సూచించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టే నటించసాగింది. కట్ చేస్తే పోలీసులు ఆమె బాగోతాన్ని బయట పెట్టారు. ప్రియుడి మోజులో పడిన తన భార్య అర్చన. తీగలాగితే డొంక అంత కదిలినట్లు. ఆమె వివాహేతర సంబంధం కూడా బయట పడింది. ప్రియుడితో సుఖంగా బతకాలని భర్తను లూటీ చేసింది అర్చన. పోలీసుల యాక్షన్ తో సరెండర్ అయి అన్ని సమర్పించేసుకుంది.