కరోనా టెస్ట్ చేసుకోని యువకుడికి దేహశుద్ది..
posted on May 25, 2021 9:09AM
కరోనా ఆ పేరు వింటే చాలు. హారర్ సినిమాలో సీన్ కంటే దారుణంగా ఉంది. రోజు ఎంతో మంది. తుపాకీ చప్పుడు విని చెట్టు మీద పిట్టలు ఎగిరినట్లు కరోనా దెబ్బకు మనుషులు కూడా అలా ఎగిరిపోతున్నాడు. సచ్చినా శవాలను దహనం చేయడానికి స్మశానాలు కాళీ లేవు. వేసుకోవడానికి వ్యాక్సిన్ లేదు. పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేదు. ఇలాంటి పరిస్థితులు చూస్తూకూడా, టైం లో ఎవరి ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. కొంత మంది మాస్కులు పెట్టుకోవడం లేదు.
దేశం లో చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడం లేదు. వ్యాక్సిన్ కూడా దొరకడం లేదు. ఇంకొంత మంది కోవిద్ పాజిటివ్ వచ్చాక ఇతరుల గురించి ఆలోచించకుండా హాస్పిటల్స్ నుండి పారిపోతున్నారు. తాజగా కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా టెస్టు చేయించుకోలేదని బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ(బీబీఎంపీ) సిబ్బంది ఇద్దరు యువకులను చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. బెంగళూరులోని నాగరత్‌పేట్ టెస్టింగ్ కేంద్రంలో టీకా కోసం వచ్చిన ఇద్దరు యువకులు చాలా సేపు లైన్‌లో వెయిట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత అది టీకా కేంద్రం కాదు, కొవిడ్ పరీక్షా కేంద్రం అని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన బీబీఎంబీ సిబ్బంది.. వారిని టెస్టు చేయించుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సిబ్బంది.. యువకులను దారుణంగా కొట్టారు. ఈ విషయం కాస్తా పోలీసులకు.. తెలియడంతో యువకులపై చేయి చేసుకున్న అధికారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.