రూ.18,500లకే ఇల్లు!
posted on Jul 2, 2022 @ 10:36AM
టీవీల్లో రియల్ ఎస్టేట్‌వారు యాడ్స్‌తో ఊదరగొట్టేస్తుంటారు. ఇన్ని లక్షలు, మరెంతో సౌకర్యాలతో టూ బెడ్‌రూమ్, త్రీ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ అని, విల్లాలనీ.. మనిషికి సౌకర్యాలతో కలిగిన ఇల్లు కావాలిగాని కోట్లు ఖరీదు చేసేది కాదు. అసలు ఇంటి కంటే హంగులూ ఆర్భాటాలకే మనకు తెలీకుంా ఎక్కువ డబ్బు తగలేస్తుంటాం. బెంగుళూరుకి చెందిన మహేష్ కృష్ణన్ కేవలం 18,500 రూపాయలతో ఇల్లు కట్టేసుకున్నా డు, అదీ 125 రోజుల్లో!
ఇళ్ల నిర్మాణం గురించి ఒక్కసారి చరిత్రలోకి వెళితే మన దేశంలో చాలాకాలంనుంచి మట్టి ఇళ్ల నిర్మాణం వుంది. పూర్వం అవే ఇళ్లు దర్శనమిచ్చేవి. కాలక్రమంలో కాంక్రీట్ హడావుడి ఎక్కువయింది. కానీ ఇప్పటికీ ఒరిస్సాలో చాలా గ్రామాల్లో మట్టి ఇళ్లు కట్టుకుంటున్నారు. కృష్ణన్ సుమారు 19 సంవత్సరాలు లె మెరిడి యన్, తాజ్ గేట్‌వే వంటి పెద్ద పెద్ద హోటళ్లలో పని చేశా రు. అంటే తానేదో అందమైన, విశాలమైన ఇళ్లలో వుండవచ్చుననుకునేరు. ఆయన తన వుద్యోగానికి రాజీ నామా చేసి సహజ వ్యవసాయం, సహజ భవన నిర్మాణం పట్ల ఆసక్తితో వాటిలో శిక్షణ పొందారు.
మట్టి, పేడ, రాళ్లు, పొట్టు, తాటి ఆకులు మొదలైన సహజ వస్తువులతో ఇంటిని ఎలా నిర్మించాలో నేర్చుకు న్నారు. బెంగళూరులోని చామరాజనగర్‌లో ఉన్న 300 చదరపు అడుగుల ఇంటిని కృష్ణన్ నిర్మించారు. అతను అడోబ్, వాటిల్ అండ్ డౌబ్ గోడలతో స్థలాన్ని తయారు చేయడానికి స్థానిక పదార్థాలను ఉపయో గించాడు. ఇలాంటి ఇళ్లను నిర్మించాలనే ఆసక్తి ఉన్న పలువురు సందర్శకులు ఈ ఇంటికి తరచుగా వస్తుంటారు. మట్టి ఇంటి కోసం విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నది మహేశ్ కృష్ణన్ ఒక్కరే కాదు. బెంగళూరు జంట వాణి కన్నన్, భర్త బాలాజీ గత 28 సంవత్సరాలుగా ఇంగ్లాండ్‌లో నివసించిన తర్వా త 2018లో భారతదేశానికి వచ్చారు. వారు పర్యావరణ అనుకూలమైన స్థిరమైన ఇంటిని నిర్మించాలని నిర్ణ యించుకున్నారు.
బెంగుళూరులో 2020లో వారు మంచి ఇంటి కోసం వెతికి వేసారారు. అన్నీ అపార్ట్‌మెం ట్లలోనూ లక్షల్లో పెట్టవలసి వస్తోంది. అప్పుడు వారికి బెంగుళూరుకి చెందిన మహీజా సంస్థ గురించి తెలి సింది. వారు ఎంతో పటిష్టమైన, పదికాలాలు వుండే ఇళ్లు వీలయినంత తక్కువ ఖర్చులోనే నిర్మిస్తారని తెలుసుకున్నా రు. వెంటనే వాణికన్నన్ తమ 2,400 చ.అ స్థలంలో మహీజావారి చేత వారికి ఇష్టమైన డిజైన్‌లో మంచి విశాలమైన ఇల్లు కట్టించుకున్నారు. ఇలా మట్టి ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో వున్నది. అక్కడి గ్రామాల్లో అక్కడి మట్టితోనే కొందరు కలిసి చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుంటున్నారు.