రెండు నెలల్లో 50 కోట్ల మద్యం.. తాగేసిన హుజురాబాద్ జనం..
posted on Oct 30, 2021 @ 12:11PM
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అత్యంత కాస్ట్లీగా మారింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల్లో హుజురాబాద్ నిలిచిపోతుందని అంటున్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే నియోజకవర్దంలో రాజకీయం వేడెక్కింది. జూలై నుంచే ఓటర్లకు ప్రలోభాలు మొదలయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ లో పీక్ స్టేజీకి చేరాయి. గత రెండు నెలలుగా హుజురాబాద్ ఓటర్లు పండుగ చేసుకున్నారు. మందుకు ఢోకా లేకుండా పోయింది. ప్రధాన పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశాయి. తాగేవారికి తాగినంతగా మద్యం ఇచ్చారు.
పోటా పోటీ ప్రచారం తో పాటు మద్యం మాంసం విందులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మద్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు తేదీ సమీపిస్తున్న రోజు ల్లో ప్రతి రోజు దాదాపు గా రెండు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గురు శుక్ర వారా ల్లో నియోజక వర్గంలో భారీ గా మద్యం పంపిణీ జరిగి నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం పొంతన లేని సమాధానం చెబుతున్నారు. గతేడాది మాదిరి గానే మద్యం అమ్మకాలు జరిగినట్లు రికార్డులు చూపెడుతున్నారు.
హుజురాబాద్ లో ఖర్చు చేసిన మద్యాన్ని వివిధ జిల్లాల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఎవరీ కంట పడ కుండా డంప్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ నెల లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో 76 కోట్ల 19 లక్షల 22 వేల రూపాయల మద్యం అమ్మ కాలు జరిగాయి. హుజురాబాద్ లో పరిధిలో 11 కోట్ల 3 లక్షల 64 వేల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. జమ్మికుంట లో 12 కోట్ల 24 లక్షల 64 వేల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక అక్టోబర్ నెలలో జిల్లాలో 84 కోట్ల 64 లక్షల రూపాయల మద్యాన్ని అమ్మారు. ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్ లో 11 కోట్ల 53 లక్షలు జమ్మికుంట లో 13 కోట్ల 21 లక్షల రూపాయల వ్యాపారం జరిగింది. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో 48 కోట్ల 2 లక్షల 28 వేల రూపాయల మద్యం అమ్మినట్లు చెబుతున్నారు.
ఈ మద్యం లెక్కలు కేవలం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోవి మాత్రమే. అయితే హుజురాబాద్ పక్కనే ఉన్న వరంగల్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలోని షాపుల నుంచి భారీగా మద్యం తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా గత రెండు నెలల్లోనే హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 60 కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగినట్లు చెబుతున్నారు.