భూమిపై గురుత్వాకర్షణ లేని 6 ప్రదేశాలు...!
posted on Nov 30, 2020 @ 9:30AM
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. కానీ భూమి తిరుగుతున్నప్పుడు, దానిమీద ఉన్న మనం , ఇతర వస్తువులు ఎందుకు కిందపడట్లేదో ఎప్పుడైనా ఆలోచించామా..? కింద పడిపోక పోవడానికి కారణం గురుత్వాకర్షణ. దీన్ని మొదటిసారిగా ఆర్యభట్ట వివరించాడు. ఈ భూమిపై నిలబడి మనం ఏ వస్తువును విసిరివేసిన.. లేదా కిందకు పాడేసిన అది కిందపడి పోతుంది. కానీ కొన్ని ప్లేసుల్లో మాత్రం కిందకు వేసినవి భూమిపైన పడకుండా పైకే వెళతాయి. అలాంటి 6 వింతలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం..
1. రివర్స్ జలపాతం, ఇంగ్లాండ్.
ఈ జలపాతం హేఫీల్డ్ దగ్గర ఉంది. ఈ ప్రదేశంలో నీళ్లు కిందకు ప్రవహించడానికి బదులు పైకే ప్రవహిస్తుంది. దీనికి కారణం గాలి. ఇక్కడ గాలి బలంగా వీస్తుంది. అందుకని దిగువకు ప్రవహించే నీరు గాలి ఒత్తిడి మూలంగా పైకి పైకి నెట్టబడుతుంది. అద్భుతమైన ఈ జలపాతం 78 అడుగుల ఎత్తులో ఉంటుంది.
2. రహస్యాల ఇల్లు, ఒరెగాన్, యు.ఎస్.
ఇక్కడి అడవిలో చిన్న గది లాంటి ఇల్లు ఉంది. ఇదేమి ఒరెగాన్ ఆధ్యాత్మిక సుడిగుండం కాదు. స్థానిక అమెరికన్లు ఈ ప్రాంతాన్ని 'నిషేధిత భూమి'గా వర్ణించారు. ఈ స్థలంలో ఒక రకమైన గోళాకారపు శక్తి కేంద్రం ఉందని వాళ్ళు నమ్ముతారు. అందులో సగం శక్తి కింద అడుగు భాగాన, మరికొంత పై భాగాన కేంద్రీకృతం అయి ఉందని భావిస్తారు.
ఇక్కడికి వచ్చిన సందర్శకులు వాస్తవికంగా ఆ అనుభూతిని చెందుతారు. ఈ ప్రదేశంలో గురుత్వాకర్షణ ఉండదు. కాబట్టి నడవడం సాధ్యం కాదు. సందర్శకులు సముద్రంలో పడకుండా ఉండాలంటే గోడలను పట్టుకోవాలి. ఆ ఇంట్లో చీపురు ను ఉంచినా కూడా కిందపడకుండా ఎప్పుడూ అది నిటారుగానే ఉంటుంది. ఈ విచిత్రమైన మర్మమైన ప్రదేశంలో బాల్స్ ను ఉంచినా అవి ఉపరితలంపై పైకి వస్తాయి. ఈ మాయా ఘటనల వెనుక ఎటువంటి ట్రిక్స్ లేవు. కేవలం గురుత్వాకర్షణ లేకపోవడమే దీనికి కారణం.
3. అరాగట్స్ పర్వతాల కింద ఉన్న రోడ్, ఆర్మేనియా.
ఈ పర్వతం టర్కీ, అర్మేనియా సరిహద్దులో ఉంది. ఈ అద్భుతమైన గురుత్వాకర్షణ నిరోధక దృగ్విషయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు ఈ పర్వతాన్ని సందర్శిస్తారు.
ఈ పర్వతం కింద ఎవరైనా కార్ ఇంజన్ ఆపి అక్కడే ఉంచితే దాన్ని డ్రైవ్ చేయకున్నా కూడా పైకి వెళుతుంది. ఆ ప్రదేశాన్ని సందర్శించిన వ్యక్తులు దిగువ వైపు వెళ్లడం కంటే పైవైపు వెళ్లడం చాలా సులభం అని చెబుతారు.
4. హూవర్ డ్యామ్, నెవాడా, యుఎస్.
ఈ ఆనకట్ట ఎత్తు 726.4 అడుగులు. ఎవరైనా కానీ ఈ పొడవైన ఆనకట్టను అధిరోహించాలని అనుకుంటే చిన్న ప్రయోగం చేస్తే చాలు. పెద్దగా చేయవలసిన అవసరం లేదు, బాటిల్లోంచి కొంచెం నీళ్లను కిందుకు పోస్తే అది కింది వైపు ప్రవహించదానికి బదులు పైకి ప్రవహిస్తుంది. ఇది కేవలం ఒక్క నీటి విషయంలోనే కాదు, ఆ ఆనకట్ట నుండి ఏ వస్తువును క్రిందికి విసిరినా ఆ వస్తువు కిందికి పడకుండా పైకి తేలుతుంది. ఇలా వస్తువులు తేలుతూ లేదా నీరు పైకి ప్రవహించటానికి కారణం ఈ ప్రదేశంలో ప్రవహించే బలమైన గాలి.
5. డెవిల్స్ టవర్, వ్యోమింగ్, యుఎస్.
ఈ ప్రదేశం లాడ్జ్ రేంజర్ జిల్లాలో ఉంది. మట్టిదిబ్బ అద్భుతమైన ఆకారం, పరిమాణం వ్యోమింగ్‌లో చాలా ముఖ్యమైన దృశ్యాన్ని చేస్తుంది. హైకర్లు కూడా ఇష్టపడతారు. కాని కొన్ని కారణాల వల్ల, ఎవరెస్ట్ మౌంట్ ఎక్కిన హైకర్లు కూడా డెవిల్స్ టవర్ శిఖరాన్ని అధిరోహించడంలో విఫలమవుతాడు.
ఇది 1,267 అడుగుల పొడవు మాత్రమే ఉన్నప్పటికీ, దీని వెనుక కారణం అది నిటారుగా ఉన్న గోడలు. ఈ నిటారుగా ఉన్న గోడలు హైకర్లు పైకి చేరుకోవడం అసాధ్యం చేస్తుంది . తిరిగి రావడం మరింత కష్టతరం చేస్తుంది.
6. దక్షిణ కొరియాలోని మర్మమైన రహదారి.
జెజు ద్వీపంలోని ఈ రహదారిపై ఖాళీగా పడి ఉన్న డబ్బాలు, సీసాలు సాధారణంగా క్రిందికి వెళ్లడానికి బదులుగా పైకి వెళ్తాయి. పర్యాటకులు దీనిని చాలాసార్లు ప్రాక్టికల్ గా ప్రయత్నించి చూశారు కూడా. దీన్ని గమనించిన అధికారులు ఈ రహదారిని మాగ్నెట్ కలిగిన పర్యాటక ప్రాంతంగా మార్చారు. గురుత్వాకర్షణ క్రమరాహిత్యం ఎక్కడ మొదలవుతుందో చూపించేందుకు అక్కడ సైన్ బోర్డును కూడా పెట్టారు.