తాగి పోలీసులపై దాడి చేసిన అమ్మాయిలు
posted on Oct 3, 2018 @ 2:48PM
మద్యం మత్తులో చెలరేగిపోయిన నలుగురు యువతులు పోలీసులపై దాడి చేసిన ఘటన ముంబయి మహానగరంలో చోటుచేసుకుంది. మీరా రోడ్ లో జరిగిన ఓ పార్టీ లో మద్యం సేవించిన వీరు భయాండర్‌లోని ఓ ప్లే గ్రౌండ్ కు చేరుకున్నారు.ఈ క్రమం లో వారి మధ్య గొడవ మొదలైంది.వారి గొడవతో గుంపు పోగయ్యింది అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలిసులు వారి గొడవను గమనించారు.గొడవ పడుతున్న యువతులను విడతీసే ప్రయత్నం చేసారు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ మనీషా పాటిల్.
మద్యం మత్తులో ఉన్న వీరు పోలిసుల మాటలను పెడచెవిన పెట్టి పోలిసుల పై దాడి చేసారు.లాఠీలను లాక్కునే ప్రయత్నం చేసారు.పోలీస్ ల షర్ట్ బటన్స్ ,బ్యాడ్జిలను లాగేందుకు ప్రయత్నం చేసారు.పోలీసులను అసభ్యపదజాలంతో దూషించారు.ఆ నలుగురు అమ్మాయిలను మమతా మెహార్(25), అలీషా పిైళ్లె(23), కమల్ శ్రీవాత్సవ(22), జెస్సీ డీ కోస్టా(22)లుగా గుర్తించారు.నలుగురు అమ్మాయిలను అరెస్టు చేసే క్రమంలో ఓ యువతి తప్పించుకుంది. మిగతా ముగ్గురిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.డీ కోస్టా పరారీలో ఉంది.ఈ నలుగురిపై కేసు నమోదు చేసారు.వైద్య పరీక్షలు నిర్వహించగా వారు మద్యం సేవించినట్లు తేలిందని పోలీసులు ధ్రువీకరించారు.